Eyebrows: కనుబొమ్మల గురించి మీకు తెలియని విషయాలు ఇవీ

Eyebrows: కనుబొమ్మలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? అసలు వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు చూసేద్దాం పదండి.

Written By: Swathi, Updated On : June 18, 2024 2:27 pm

Things You Did not Know About Your Eyebrows

Follow us on

Eyebrows: కనుబొమ్మలు ఎంత బాగుంటే ఫేస్ అంత బాగా కనిపిస్తుంది కదా. కొందరికి ఒత్తుగా, పొడుగ్గా బాగుంటాయి. వారి అందం మొత్తం కళ్లలోనే ఉందా అన్నట్టుగా ఉంటారు. ఇక కొందరికి పల్చగా ఉంటాయి. ఎలా ఉన్నా ఈ కనుబొమ్మలు మాత్రం కళ్లకు చాలా ఇంపార్టెంట్. ఐబ్రో చేయించడం కూడా అందం కోసమే కదా. అయితే ఈ కనుబొమ్మలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? అసలు వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు చూసేద్దాం పదండి.

కళ్లకు రక్షణ: కనుబొమ్మల ప్రధాన విధుల్లో కళ్లను రక్షించడం మొదటి బాధ్యత అనే చెప్పాలి. నీరు, చెమట, దుమ్ము వంటివి మన కళ్ళలోకి రాకుండా నిరోధిస్తుంటాయి. అంటే ఇవి సహజ అవరోధాలు అన్నమాట. అలాగే మన కంటిచూపును స్పష్టంగా ఉంచుతాయి కూడా.

ప్రత్యేకత: ఏ రెండు జతల కనుబొమ్మలు కూడా సరిగ్గా ఒకేలా ఉండవట. కనుబొమ్మల మందం, ఆకారం, వంపు ప్రతి వ్యక్తికీ మారుతుంటాయి. అందుకే వీటిని కూడా ప్రత్యేకంగా భావిస్తుంటారు.

Also Read: Flight: ఈ కాయను విమానంలోకి అస్సలు అనుమతించరు తెలుసా?

ఆయుష్షు: కనుబొమ్మలకు ఆయుష్షు కూడానా అనుకుంటున్నారు కావచ్చు. కానీ వీటి వెంట్రుకలు కూడా ఒక నిర్ధిష్ట సమయానికి రాలుతుంటాయి. అదే ప్లేస్ లో కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తుంటాయి. కనుబొమ్మల వెంట్రుకలు సుమారుగా 4 నెలల పాటు మాత్రమే జీవిస్తాయి. ఈ నిరంతర చక్రం మన కనుబొమ్మలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయం అవుతుంది.

కవళికలు: కనుబొమ్మలు కూడా ముఖ కవళికలలో కీలక పాత్ర పోషిస్తాయట. అలాగే కోపం, ఆనందం, ఆశ్చర్యం, విచారం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలను తెలియజేస్తాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మనం ఈ భావాలను తెలపవచ్చు. ఇతరులు కూడా మన మూడ్ ను సులభంగా అర్థం చేసుకోగలరు.

Also Read: Lakshadweep: లక్షద్వీప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

పెరుగుతాయి: తాకకుండా కనుబొమ్మలను అలాగే వదిలేస్తే ముఖం బయటి అంచుల వైపు పెరిగే అవకాశం ఉందట. అందుకే కనుబొమ్మలను నీట్ గా, మంచి ఆకారంలో ఉంచడానికి రెగ్యులర్ గా అలంకరణ, మెయింటెనెన్స్ చేస్తుండాలి. తలపై ఉన్న వెంట్రుకలు నెలకు 0.5 అంగుళాల చొప్పున పెరుగితే.. కనుబొమ్మలు మాత్రం చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ఇవి నెలకు 0.16 అంగుళాలు మాత్రమే పెరుగుతాయి. అందుకే వీటిని తరచుగా కట్ చేయకూడదు.