Lakshadweep: లక్షద్వీప్ కు చాలా మంది వెళ్తుంటారు. ఈ ప్రాంతం చూడటానికి చాలా అందంగా, సుందరమైన పర్యాటక ప్రాంతాలతో ప్రజలను ఆకట్టుకుంటుంది. మరి ఓ సారి దీని గురించి తెలుసుకుందామా. 1500 బీసీ నుంచే లక్షద్వీప్‌లో మానవుల మనుగడ మొదలైందట. బుద్ధుడి జాతక కథల్లో కూడా దీని గురించి ప్రస్తావనం ఉంద. అయితే ఇక్కడికి ఎక్కువ ఇతర దేశాలకు చెందిన నావికులు వస్తూ పోతూ ఉండేవారట.మొట్ట మొదటి సారి మొదటి శతాబ్ధంలో ఈ దేశ ప్రసక్తి వచ్చింది. గ్రీక్ నావికుడు ఒకరు తాబేలు మూపురంలా ఉందని ఈ ద్వీపం గురించి తెలిపాడట.
1100ల కంటే ముందు కులశేఖర వంశం ఏలుబడిలో ఉండేది లక్షద్వీప్. ఆ వంశం నశించిన తర్వాత కొలత్రిస్ అనే వంశం ఏలిందట. అంతేకాదు ఒకసారి పల్లవుల ఏలుబడిలో కూడా ఉండేదని చెబుతుంది చరిత్ర. చెర, సంగమ్ పాటిరు పట్టుల ఏలుబడిలోనూ కూడా ఉండేది. 661 సంవత్సరంలో ఉబైదుల్లా అనే వ్యక్తి ద్వారా ఇస్లామిక్ లక్షద్వీప్‌లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. 16వ శతాబ్ధంలో లక్షద్వీప్ కన్నోర్ రాజ్యంలోకి వెళ్లిందట. ఆ తర్వాత 1787లో అమిన్ దీవిలోని ద్వీపాలు అన్నింటిని టిప్పు సుల్తాన్ ఏలారు.
1956లో రాష్ట్రాల విభజించటంతో మలబార్ జిల్లా నుంచి లక్షద్వీప్ వేరైంది. కేంద్ర ప్రాంత పాలితంగా మారిపోయాయి ఇవి. 1973 వరకు లక్షద్వీప్‌ను లక్కదీవి, మినికాయ్, అమిన్‌దివి అంటూ పిలిచేవారు. 1973, నవంబర్ 1వ తేదీన లక్షద్వీప్ గా పేరు రూపాంతరం చెందింది. లక్షద్వీప్‌లో అన్ని ద్వీపాలు చాలా చిన్నవిగా ఉంటాయట. ప్రతీ ద్వీపం 1.6 కిలోమీటర్ల పొడవుకు మించి ఉండదని టాక్. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది మలబార్ తీరానికి చెందిన వారే ఉంటారు.
ఇక్కడ ఎక్కువగా ముస్లింలు ఉంటారు. ఇక్కడ ఎక్కువ మలయాళం మాట్లాడతారు. లక్షద్వీప్‌లోని మినకాయ్‌లో మాత్రం సింహళం మాట్లాడతారట. ఈ భాషలతో పాటు హిందీ మాట్లాడేవారు కూడా ఉన్నారు. జనం ఎక్కువగా కొబ్బరి సాగుతో జీవిస్తుంటారు. దీనితో పాటు చేపల వేట కూడా ప్రధానమే.ఈ ద్వీప నీటిలో షార్కులు, బోనిటాస్, టూనాలు, స్నాపర్స్, ఎగిరే చేపలు, ఆక్టోపస్‌లతో పాటు చాలా రకాల జీవులు నివసిస్తున్నాయి.
అయితే అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉండటంతో లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ 10 దీవుల్లో మాత్రమే జనాభా ఉన్నారని టాక్. మిగిలిన 17 దీవులలో జనాభా లేరట. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం కలిసి 70వేలు లోపు మాత్రమే ఉన్నారట.