Vidadala Rajini: వైసీపీకి వరుసగా షాక్ లు తప్పడం లేదు. మున్ముందు మరింత కష్టాలు తప్పేలా లేవు. గత ఐదు సంవత్సరాలుగా వివిధ కారణాలతో పార్టీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఓటమితో వెనుదిరుగుతున్నారు. పార్టీని వీడుతున్నారు. ఫలితాలు వెలువడిన ఈ రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘవరావు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజా మాజీ మంత్రి విడదల రజిని సైతం బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది.ఆమె ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.
Also Read: Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏదో చేసేటట్టే ఉన్నాడే!
ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె ఓ నిర్ణయం తీసుకోవచ్చని గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. విడదల రజనీకి జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. టిడిపిలో ఉన్న ఆమెను తీసుకొచ్చి 2019లో చిలకలూరిపేట టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇచ్చారు. ఏకంగా వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. జూనియర్ గా ఉన్నా బీసీ నేత కావడం, మహిళగా ఆమెను గుర్తించి ఎంతగానో ప్రోత్సహించారు జగన్.కానీ ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తప్పించారు. గుంటూరు పశ్చిమ సీటును కేటాయించారు. అయినా సరే ఆమెకు ఓటమి తప్పలేదు. 51 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Also Read: Pawan Kalyan : పవన్ కు చంద్రబాబు మామూలుగా ప్రాధాన్యత ఇవ్వడం లేదుగా.. ఇదిగో ఫ్రూఫ్
అయితే నియోజకవర్గం మారడం వల్లే తాను ఓడిపోయానని రజిని మనస్థాపానికి గురయ్యారు. అటు పార్టీ 11 స్థానాలకి పరిమితం కావడంతో.. వైసీపీలో కొనసాగాలనే నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరకముందు ఆమె చాలా కాలం పాటు టిడిపిలో పనిచేశారు. అయితే ఆమె ఓ జాతీయ పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు. బిజెపి ఇప్పటికే టిడిపి తో జతకట్టింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా దాని ఉనికి అంతంత మాత్రమే. అందుకే విడదల రజిని ఏ పార్టీలో చేరతారన్నది సస్పెన్స్ గా మారింది. ఆమె మాత్రం వైసీపీని వీడడం ఖాయంగా తేలుతోంది.