Flower Plants: గులాబీ నుంచి మందార.. ఈ ఏడు పూల మొక్కలు మీ పెరట్లో పెంచుకోవచ్చు!

పూజలో పూలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. మహిళలు ఇష్టపడే వస్తువుల్లో కూడా పూలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి ఆవరణలోనూ పూల మొక్కల పెంపకానీకి ప్రాధాన్యం ఇస్తారు.

Written By: Raj Shekar, Updated On : October 2, 2023 2:13 pm
Follow us on

Flower Plants: పూలు.. ఇష్టముండని వారు ఉండరు. అయితే కొంత మందికి అలర్జీ ఉంటుంది. కులం, మతంతో సంబంధం లేకుండా అందరూ పూజకు వాడే వస్తువు పూలు. ఇంటికి అందం తెచ్చేది కూడా పూలే. పండుగల వేళల్లో గుమ్మాలకు శోభ తెచ్చేవి పూలే. లక్ష్మీదేవిని ఆహ్వానించేది పూలే. ఇక మహిళల అందాన్ని మరింత పెంచేవి కూడా పూలే. పూజలో పూలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. మహిళలు ఇష్టపడే వస్తువుల్లో కూడా పూలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి ఆవరణలోనూ పూల మొక్కల పెంపకానీకి ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇంటి ఆవరణలో పెంచుకునే ఏడు పూల మొక్కల గురించి తెలుసుకుందాం.

గులాబీ..
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, ఇష్టమైన పువ్వులలో గులాబీలు ఒకటి. అవి వివిధ రంగులలో వస్తాయి. తోటలుగా పెంచడమే కాదు. ఇంటి ఆవరణలోని తొట్టెలలో కూడా సులంగా పెరుగుతాయి.

జాస్మిన్‌..
మల్లె మొక్కలు. సువాసనగల తెల్లని పువ్వులు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే పూలు. సాధారణంగా కుండలలో లేదా కంచెలు మరియు ట్రేల్లిస్‌లపై పెంచుకునే అవకాశం ఉంటుంది.

మందార..
హైబిస్కస్‌ మొక్కలు, వాటి పెద్ద, రంగురంగుల పువ్వులకు ప్రసిద్ధి చెందాయి, భారతీయ తోటలలో సాధారణం. వాటిని పూజకు ఉపయోగిస్తారు, ఆకులను జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు

బంతి పువ్వు
మారిగోల్డ్స్, ముఖ్యంగా నారింజ, పసుపు రకాలు. సాధారణంగా భారతీయ ఇళ్లలో పెరుగుతాయి. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో అలంకరణకు వీటిని విరివిగా ఉపయోగిస్తారు

ప్లూమెరియా
ప్లూమెరియా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఉష్ణమండల పూల మొక్క. ఇది దాని సువాసన మరియు రంగురంగుల పువ్వుల కోసం బాగా ఇష్టపడుతుంది. దండల తయారీలో ప్లూమెరియా పువ్వులను తరచుగా ఉపయోగిస్తారు

అపరాజిత
అపరాజిత అనేది ఒక క్లైంబింగ్‌ ప్లాంట్‌. ఇవి ప్రకాశవంతమైన నీలం లేదా ఊదా రంగులో ఉంటాయి. ఈ పువ్వులు మూలికా టీని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని భారతీయ ఆచారాలలో కూడా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇంటి ఆవరణలో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు.