Site icon OkTelugu

Balakrishna Freedom Fighter Role: బాలయ్యను ఆ గెటప్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారా..?

Balakrishna

Balakrishna

Balakrishna Freedom Fighter Role: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన నటుడు ‘నందమూరి తారక రామారావు’… ఒకప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించేవి… పౌరాణిక సినిమాలకు పెట్టింది పేరుగా మారిన ఆయన తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను మూట గట్టుకున్నాడు… ఇక తన తర్వాత తన నట వారసుడిగా బాలయ్య బాబు వచ్చి మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలన్నింటితో తనకు మంచి ఇమేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన మార్కెట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు…

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరిలో తను ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం మాస్ సినిమాలే చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న బాలయ్య బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ముఖ్యంగా అతని అభిమానులైతే ఫ్రీడం ఫైటర్ కి సంబంధించిన ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా ఆయన ఒక సినిమా చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య బాబు సైతం అలాంటి కథ దొరికితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తన దగ్గరికి అలా ఏ దర్శకుడు కూడా ఆ కథతో రావడం లేదని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశారు.

ఇక ఇప్పటికైనా ఎవరైనా దర్శకులు అతని దగ్గరికి సుభాష్ చంద్రబోస్ కథను తీసుకొని వెళ్తే మాత్రం బాలయ్య బాబు తప్పకుండా చేస్తారట ఆ గెటప్ లో బాలయ్యను చూసి తరించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు…మరి అది వర్కౌట్ అవుతుందా బాలయ్య ఆ సినిమా చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version