Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ప్రేక్షకుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సీజన్ ని ఉల్టా పుల్టా అంటూ కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభించారు . ఇంట్లో కి కేవలం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మాత్రమే అడుగుపెట్టారు . వీరిలో ఏ ఒక్కరు హౌస్ మేట్ కాదు. ఉత్తమ ప్రతిభతో పవర్ అస్త్ర గెలిచిన వాళ్లే ఇంటి సభ్యులు అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. సందీప్, శివాజీ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ వరుసగా పవర్ అస్త్ర గెలిచారు.
ఇలా మొదలైన సీజన్ ఇప్పుడు నాలుగు వారాలు పూర్తి చేసుకుంది . బిగ్ బాస్ షో లో అతి ముఖ్యమైనవి నామినేషన్ ఇంకా ఎలిమినేషన్. ఇవి రెండు కీలక పాత్ర పోషిస్తాయి . బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ చూడనిది మొదటి సారి ఇలా జరిగింది . వరుసగా నాలుగు వారాలు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది .ఇది ఒక రికార్డు బిగ్ బాస్ సీజన్ 7 మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది . ఇక రెండవ వారం షకీలా ,మూడవ వారం సింగర్ దామిని హౌస్ కి గుడ్ బై చెప్పారు. ఇక తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో టైటిల్ ఫేవరెట్ రతిక రోజ్ , ఆడియన్స్ తిరస్కరించడంతో ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళింది. ఇలా వరుస పెట్టి నాలుగు వారాలు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఇది ఫస్ట్ టైం . గత సీజన్స్ తో పోల్చుకుంటే ఇలా ఎప్పుడు జరగలేదు .
కిరణ్ రాథోడ్ ,షకీలా, దామిని వీరు ముగ్గురు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏవైనా అవ్వొచ్చు,కానీ బిగ్ బాస్ ముద్దు బిడ్డ రతిక మాత్రం ఏదో చెయ్యాలి అనుకోని ఇంకేదో చేసింది . తనతో కలిసుండే వారితో బాగా ఉంటూనే సమయం రాగానే వెన్నుపోటు పొడిచింది . ఆమె ప్రవర్తన చూసి ఆడియన్స్ ,రతిక ని పంపించేయాలని డిసైడ్ అయిపోయారు . రతిక పై నెగిటివ్ కామెంట్స్ చేశారు . రతిక ఇలా చేయకుండా హద్దుల్లో ఉండివుంటే ,ఆమె స్థానంలో తేజ ఎలిమినేట్ అయ్యేవాడు. ఏదేమైనా నాలుగు వారాలు కంటిన్యూ గా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఊహించని పరిణామం.