Love: అబ్బాయిలు అమ్మాయిని ప్రేమిస్తే చెప్పడానికి కొందరు ధైర్యంగా చెబుతారు. కానీ మరికొందరు అబ్బాయిలు భయపడుతుంటారు. ఒక వేళ అమ్మాయికి చెప్పిన తర్వాత ఒప్పుకోకపోతే అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది వాళ్ల ప్రేమను వ్యక్తపరచరు. అయితే ప్రేమను మాటల్లో మాత్రమే కాకుండా చూపుల్లో, ప్రవర్తనల్లో కూడా తెలుసుకోవచ్చు. ఎవరైనా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నట్లయితే.. ప్రవర్తన బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆ విషయాన్ని చెప్పకపోయిన కూడా అమ్మాయిలకు అర్థం అవుతుంది. కాకపోతే అర్థం కాలేదనే ఉద్దేశంతోనే ఉంటారు. వాళ్ల ప్రేమను వ్యక్తపరచనప్పుడు నేను ఎందుకు ముందు బయటపడాలని కొందరు భావించి తెలిసిన అబ్బాయిలను అడగరు. మరి అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో? లేదో? తెలియాలంటే అతని ప్రవర్తనను గమనించాల్సిందే. అతని ప్రవర్తనలో వచ్చే ఆ మార్పులేంటో మరి తెలుసుకుందాం.
చూపు బట్టి తెలుసుకోవచ్చు
సాధారణంగా అందరూ కళ్లలోకి చూస్తూ మాట్లాడరు. ఒకవేళ అలా మాట్లాడితే అతని చూపుల బట్టి ప్రేమిస్తున్నాడా లేదా అనేది అర్థం అవుతుంది. ఒక అమ్మాయిని అబ్బాయిలు ఇష్టపడితే తన మీద ఎంత ప్రేమ ఉందో చూపుతోనే అర్థం అయిపోతుంది. ఇలా మీకు అతని చూపులో మార్పులు వస్తే మిమ్మల్ని అబ్బాయి ప్రేమిస్తున్నట్లే.
మీతో మాట్లాడితే సంతోష పడటం
మనకి ఇష్టమైన మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కొందరి ముఖంలో వాళ్లకు తెలియకుండానే నవ్వు వస్తుంది. అలాగే కొంచెం భయంగా, సిగ్గు పడుతూ మాట్లాడుతుంటారు. ఇలా మీతో మాట్లాడితే వాళ్లకు మీ మీద ఇష్టం ఉందని అర్థం చేసుకోండి. ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా మీతో మాట్లాడితే ఫీలింగ్స్ లేవని అనుకోండి.
కేర్ ఎక్కువగా చూపించడం
ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి సహజం. అయితే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఏ విషయంలో అయిన బాధపడటం వంటి సమయాల్లో మీపై కేర్ ఎక్కువగా చూపిస్తున్నంటారు. ఇష్టమైన వాళ్ల మీద మాత్రమే కేర్ చూపిస్తారు. కష్ట సమయంలో తోడుగా ఉంటారు.
ఎందరు ఉన్న మీ మీదే దృష్టి
చుట్టూ ఎంత మంది ఉన్నా కూడా దృష్టి అంతా మీ మీదే ఉంటుంది. మీరేం చేస్తున్నారని చూడటం, అడగటం వంటివి చేస్తుంటారు. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా మీపై ఎక్కువగా దృష్టి పెడితే ప్రేమిస్తున్నారని చెప్పకపోయిన అర్థం చేసుకోవచ్చు.
మీకు దగ్గరగా ఉండలేరు
ఫీలింగ్స్ లేకపోతే ఎవరితోనైనా బాగానే ఉంటారు. అదే ఫీలింగ్స్ ఉంటే ఇష్టమైన వ్యక్తి చేయి తగిలిన కూడా తట్టుకోలేరు. వాళ్ల పక్కన కూడా ఫ్రీగా కూర్చోలేరు. ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే మీపై వాళ్లకు ఫీలింగ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
ఇతరులతో మాట్లాడితే చూడలేరు
మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే.. మీరు ఎవరితోనైనా మాట్లాడితే తట్టుకోలేరు. ముఖ్యంగా అబ్బాయిలతో మాట్లాడితే అసలు చూడలేరు. వద్దు వాళ్లతో మాట్లాడకు అంటే ఆ అబ్బాయికి మీరంటే ఇష్టమని అర్థం చేసుకోండి.