https://oktelugu.com/

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆరు సూత్రాలు పాటించండి

బయట ఫుడ్ తినాలని ఉందని, టేస్టీగా ఉందని కొందరు కంట్రోల్ చేసుకోకుండా తినేస్తారు. తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన కూడా.. వాటినే తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా బయట ఫుడ్ తింటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 19, 2024 / 03:01 AM IST

    healthy

    Follow us on

    Health Tips: అందంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలని చాలా మంది భావిస్తారు. దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆహార విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజుల్లో అయితే ఆరోగ్యంగా ఉండాలని.. వ్యాయామం, జిమ్ వంటివి చేయడంతో పాటు ఫుడ్ విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కొందరికి ఇంట్లో వండే ఆహారం ఇష్టం లేక బయట ఫుడ్ తింటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే బరువు కూడా అధికంగా పెరుగుతారు. ఇలా చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ అయితే ఊబకాయానికి దారితీస్తుంది. అలాగే కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆహార విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. బయట ఫుడ్ తినాలని ఉందని, టేస్టీగా ఉందని కొందరు కంట్రోల్ చేసుకోకుండా తినేస్తారు. తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన కూడా.. వాటినే తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా బయట ఫుడ్ తింటారు. వీటిని తగ్గించి ఇంట్లోనే తయారు చేసిన ఆహారంతో ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ కూడా తప్పకుండా ఈ ఆరు సూత్రాలు పాటించాలి. మరి ఆ ఆరు సూత్రాలేంటో చూద్దాం.

    తక్కువ కార్బోహైడ్రేట్లు
    అన్నంలో ఎక్కువగా కార్బోహైడ్రైట్లు ఉంటాయి. ఇవి ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వీటివల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి కార్బోహైడ్రైట్లు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    బ్రౌన్ బ్రెడ్‌కి ప్రాధాన్యత ఇవ్వడం
    చాలామంది బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రోజూ కాకపోయిన అప్పుడప్పుడు అయిన కూడా వీటిని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పిండి పదార్థాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు.

    జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండండి
    ఎక్కువ మందికి ఆరోగ్యమైన ఆహారం కంటే జంక్ పుడ్ అంటేనే ఇష్టం. వీటికి దూరంగా ఉండి తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. వారంలో కనీసం మూడు రోజులు అయిన వీటిని తీసుకోవాలి.

    నీరు ఎక్కువగా తాగాలి
    అస్సలు నీరు తాగకపోతే బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. యాక్టివ్‌గా ఉండరు. అదే రోజుకి సరిపడా నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.

    మొబైల్‌ను దూరంగా పెట్టండి
    ఈరోజుల్లో తినేటప్పుడు అందరూ కూడా టీవీ, మొబైల్ వంటివి చూస్తూ తింటారు. ఇలా తినడం వల్ల శరీరానికి వంట పట్టదని వైద్య నిపుణులు అంటున్నారు. తినేటప్పుడు కేవలం తిండి మీద మాత్రమే దృష్టి పెడితే అది బాడీకి వంటపడుతుంది.

    నిద్ర తప్పనిసరి
    నిద్ర అనేది ప్రతి జీవికి అవసరం. నిద్రలేకపోతే సగం ఆరోగ్యం అక్కడే దెబ్బతింటుంది. కాబట్టి సరైన సమయానికి నిద్రపోయి, తొందరగా లేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆరు సూత్రాలు పాటించాల్సిందే.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.