https://oktelugu.com/

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఉందా? అయితే వీటి గురించి కచ్చితంగా తెలుసుకోండి..

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రోడ్డు రవాణా శాఖ ప్రకారం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆ తరువాతనే లైసెన్స్ జారీ చేస్తారు. 18 ఏళ్లు నిండిన తరువాత ముందుగా లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 19, 2024 / 01:00 AM IST

    Driving License

    Follow us on

    Driving License: ప్రయాణాలు చేయడానికి రకరకాల వాహనాలను వాడుతూ ఉంటారు. కొందరు టూ వీలర్ తో సరిపెట్టుకుంటే..మరొకిందరు 4 వీలర్ వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే నగరాల్లో ఎక్కువగా ఉండేవారు మాత్రం 4 వీలర్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి పీపుల్స్ టూవీలర్ తో సరిపెట్టుకుంటున్నారు. ఏ వెహికల్ డ్రైవ్ చేయాలన్నా లైసెన్స్ తప్పనిసరి. ఒక వ్యక్తి వాహనాన్ని నడిపేందుకు అర్హుడు అని రోడ్డు రవాణా శాఖ సర్టిఫైడ్ చేస్తుంది. ఇందులో భాగంగా లైసెన్స్ ను జారీ చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతీ వెహికల్ ఉన్నవారికి తప్పనిసరిగా ఉండాలి. ఇది లేకుండా వాహనం నడిపితే భారీగీ జరిమానా విధిస్తారు. ఒక్కోసారి జైళ్లో కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఏం చేయాలి? ఏ విధంగా లైసెన్స్ జారీ చేస్తారు?

    డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రోడ్డు రవాణా శాఖ ప్రకారం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆ తరువాతనే లైసెన్స్ జారీ చేస్తారు. 18 ఏళ్లు నిండిన తరువాత ముందుగా లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఈ కాలంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకపోతే నిజమైన డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇది ఒక్కసారి జారీ చేస్తే 15 ఏళ్ల తరువాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను మిస్ చేసుకోవద్దు. డూప్లికేట్ కార్డు ద్వారా సమస్యలు వస్తాయి.

    డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆన్ లైన్ లో ఫాం దొరుకుతుంది. లేదా మీ సేవ కార్యాలయంలోకి వెళ్లి ఈ ఫాం తీసుకోవచ్చు. ఆ తరువాత దరఖాస్తు ఫాంను నింపి ఫొటోతో సహా ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించాలి. ఈ దరఖాస్తును పరిశీలించిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి అర్హుడని భావిస్తే వారికి ముందుగా ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఈ పరీక్ష ట్రాఫిక్ రూల్స్ తెలిపే విధంగా ఉంటాయి. రోడ్డుపై మనం వెళ్లే టప్పుడు కనిపించే బోర్డుల సూచీలను ఇందులో అడుగుతారు. ఈ పరీక్ష పాసైంది.. లేనిది.. అప్పుడే చెబుతారు. ఈ పరీక్ష పాసైన తరువాత లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.

    లెర్నింగ్ లైసెన్స్ గడవు 31 రోజుల పాటు ఉంటుంది. ఈ కాలంలో ద్విచక్ర వాహనం ఉంటే నడుపొచ్చు. కానీ ఎల్ బోర్డు పెట్టుకోవాలి. అలాగే ఈ కాలంలో ఏవైనా ప్రమాదాలు చోటు చేసుకుని కేసు నమోదైతే మాత్రం లైసెన్స్ రావడానికి కష్టం అవుతుంది. అయితే 31 రోజుల గడువు పూర్తయిన తరువాత రోడ్డు ట్రాన్స్ ఫోర్ట్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ 8 ఆకారంలో ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మలుపులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ కొన్ని ట్రాఫిక్ కు సంబంధించి బోర్డులు ఉంటాయి. ఇక్కడ ఆర్టీవో ఆఫీసర్ ముందు బైక్ ను నడపాల్సి ఉంటుంది. బైక్ ను సక్రమంగా నడిపినట్లయితే అప్పుడే లైసెన్స్ వచ్చేది.. రానిది చెబుతారు.

    ఆ తరువాత కొన్ని రోజుల తరువాత లైసెన్స్ ను జారీ చేస్తారు. దీని గడవువు తేదీ ద్వారా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే లైసెన్స్ వచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తామంటే కుదరదు. జాగ్రత్తగా ప్రయాణించాలి. కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పలుమార్లు డ్రంకెన్ డ్రైవ్ చేస్తే లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎటువంటి బైక్ ను నడిపేందుకు అవకాశం ఉండదు.