Top 15 Best Selling Cars In April: 2023 ఏప్రిల్ నెల కార్ల విక్రయాల జాబితాల్లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. పలు కంపెనీలకు చెందిన 25 మోడళ్లుు 75 శాతం వరకు విక్రయాలు జరుపుకున్నాయి. వీటిలో మారుతి సుజుకీ, హ్యుండాయ్, మహీంద్రా, కీయా, టాటా మోటార్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. మారుతి సుజుకి మోడల్స్ అత్యధికంగా 48 శాతం వరకు ఉండడం విశేషం. ఈ కంపెనీ ఏప్రిల్ నెలలో 20,879 యూనిట్లు డిస్పాచ్ లతో సహా అత్యధికంగా అమ్మిన కంపెనీగా నిలిచింది. ఈ కంపెనీ నుంచి రిలీజైన మార్టినో అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్విప్ట్, బాలెనో వరుస స్థానాలు నిలపుకున్నాయి. ఆల్టో 7వ స్థానానికి పడిపోయింది.
ఈనెలలో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. అలాగే బ్రెజ్జా, న్యూమెరో యునో వాటి స్థానాల్లోనే ఉనా్నయి. హ్యూందాయ్ యొక్క క్రెటా అత్యధిక విక్రయాలు జరుపుకున్న SUV జాబితాలో చేరింది. మొత్తంగా మారుతి సుజుకీ నుంచి 18 , టాటా మోటార్స్ నుంచి 11, హ్యూందాయ్ నుంచి 12 శాతం గ్రోత్ ను సాధించాయి. ఏ కంపెనీ కార్లు ఎన్ని విక్రయించిందో వాటి డిటేయిల్స్ చూద్దాం..
మారుతి వ్యాగన్ ఆర్ 20,879, స్విఫ్ట్ 18, 753, బాలెనో 16,180 విక్రయాలు జరుపుకుంది. టాటా మోటార్స్ నెక్సానో 15,002, హ్యుందాయ్ క్రెటా 14,186 అమ్మింది. ఆ తరువాతి స్థానాల్లో మారుతి బ్రెజ్జా (11,836), ఆల్టో (11,548), టాటా ఫంచ్ (10, 132) సాధించాయి. మారుతి ఈకో 10,504 విక్రయాలతో డౌన్ ఫాలోయింగ్ లో ఉంది. ఆ తరువాత హ్యుందాయ్ వెన్యూ 10, 342, మారుతి డిజైర్ 10,132 స్థానాల్లో నిలిచాయి. వీటి తరువాత కియా సోనేట్ 9,744.. మహీంద్రా స్కార్పియో ఎన్ ప్లస్ క్లాసిక్ 96117 వెహికిల్స్ ను విక్రయాలు చేసింది. మహీంద్రా బోలెరో 9054 తో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. వీటి తరువాత మారుతి ఫ్రాంక్స్ 8784లో 15 స్థానంలో నిలిచింది.
అంతకముందు మారుతి సుజుకీ ఆల్టో టాప్ 5 లో ఉండేది. కానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయింది. అయితే వ్యాగన్ ఆర్ మాత్రం ఏప్రిల్ నెలలలోనూ టాప్ పోజిషన్ లోనే ఉంది. హ్యుందాయ్ నుంచి క్రెటా 12 శాతం గ్రోతింగ్ తో అమ్మకాలు పెంచింది. కానీ టాటా పంచ్ మాత్రం 8 శాతం మాత్రమే పెరిగింది. మొత్తంగా మారుతి సుజుకి టాప్ 3 మోడళ్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి. ఎస్ యూవీ లో ఆకర్షిస్తున్నా మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ ను బీట్ చేయలేకపోతున్నాయి.