Child Care Tips: వేసవి కాలంలో పిల్లలను క్రమశిక్షణలో పెట్టే టిప్స్ ఇవే..

సెలవు రోజుల్లో పిల్లలను వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలతో గడిపేందుకు పల్లెటూళ్లకు పంపడం మంచిది. దీంతో అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉంటుంది. వ్యవసాయ పనులు కూడా దగ్గర ఉండి చూస్తే వారికి వ్యవసాయ పద్ధతులు అలవాటవుతాయి.

Written By: Srinivas, Updated On : April 27, 2023 1:47 pm
Follow us on

Child Care Tips: వేసవి కాలం వచ్చేసింది. సెలవులు ఇచ్చేశారు. ఇక నెల రోజుల పాటు పిల్లలు ఇంట్లోనే ఉంటారు. దీంతో వారి అల్లరి చెప్పనవసరం లేదు. పిల్లలు అన్నాక అల్లరి కామన్. కానీ వారిని అలా విడిచిపెట్టకుండా వారితో మంచి పనులు చేయించాలి. అప్పుడే వారికి మంచి గుణాలు అలవడతాయి. అంతేకాని ఎండలో తిరిగేందుకు విడిచిపెడితే ఇక వారు ఇంటిపట్టున ఉండరు. ఇష్టమొచ్చినట్లుగా తిరుగుతారు. ఎండలో తిరగడం అంత మంచిది కాదు. దీంతో వారికి ఇండోర్ పనులు అప్పగించాలి. వారితో చేయించాలి.

స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి

పిల్లలకు ఫోన్ అలవాటు చేయకండి. వీలైతే వారితో డ్రాయింగ్ వేయించండి. లేకపోతే క్యారమ్, చెస్ వంటి ఆటలు ఆడించండి. కానీ మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దు. దీంతో వారికి చూపు కోల్పోయే ప్రభావం ఉంటుంది. ఇంకా కథలపుస్తకాలు చదవడం అలవాటు చేయించండి. దీంతో వారి తెలివితేటలు పెరుగుతాయి. చదువుపై వారికి శ్రద్ధ కూడా పెరుగుతుంది.

పల్లెటూర్లకు పంపండి

సెలవు రోజుల్లో పిల్లలను వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలతో గడిపేందుకు పల్లెటూళ్లకు పంపడం మంచిది. దీంతో అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉంటుంది. వ్యవసాయ పనులు కూడా దగ్గర ఉండి చూస్తే వారికి వ్యవసాయ పద్ధతులు అలవాటవుతాయి. కాలుష్యం లేని పల్లెటూరులో ఉంటే వారి మెదడు కూడా బాగా పనిచేస్తుంది.

పిల్లలపై కోపం వద్దు

పిల్లలపై చీటికి మాటికి అరవద్దు. అలా చేస్తే వారు నొచ్చుకుంటారు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఇంకా వినకపోతే ఇంకేదైనా పని పురమాయించాలి. వారిని ఊరికే ఉంచకుండా పనులు చేయిస్తే మరో ఆలోచన ఉండదు. మంచి గుణాలు అలవాటవుతాయి. ఇలా వారిని మంచి దారిలో పెట్టేందుకు ప్రయత్నించాలి. కానీ ఊరికే కోపం తెచ్చుకుంటే వారు మన మాట వినకుండా పోతారు.

అన్ని సమయం ప్రకారం

అన్ని పనులు సమయ పాలన ప్రకారం ఉండేలా ప్రణాళిక వేయండి. ఏ టైంకు ఏ పని చేయాలో సూచించే ఓ చార్టు గీసి ఇవ్వండి. దీంతో వారికి క్రమశిక్షణ కూడా అలవాటవుతుంది. ఏదైనా సమయం ప్రకారం చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. ఇది జీవితంలో కూడా వారికి బాగా పని చేస్తుంది. ఇలా వేసవి సెలవులను దుర్వినియోగం చేయకుండా వారిలో మంచి గుణాలు అలవడేలా చూసుకోవడం ఎంతైనా మంచిది.