Washington Sundar: సన్ రైజర్స్ కు బిగ్ షాక్.. గాయంతో టోర్నీకి దూరమైన కీలక ఆటగాడు..!

హైదరాబాద్ జట్టులో అతి కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే తమ స్థాయిలో రాణిస్తున్నారు. కీలక ప్లేయర్లు చేతులెత్తేస్తుండడంతో ఆ జట్టు పరాభవాన్ని మూట గట్టుకోవాల్సి వస్తోంది. రాణిస్తున్న ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ ఒకడు.

Written By: BS, Updated On : April 27, 2023 1:51 pm
Follow us on

Washington Sundar: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. వరుస పరాభవాలతో పాయింట్లు పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆశించిన స్థాయిలో రాణించలేక ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు మరో దెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ అయిన వాషింగ్టన్ సుందర్ కు గాయం కావడంతో టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐపీఎల్ తాజా సీజన్ లో హైదరాబాద్ జట్టు ఘోరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు మాత్రమే దక్కించుకోగా, ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. జట్టులో కీలక ఆటగాళ్లు రాణించలేకపోవడంతో మెరుగైన ప్రదర్శన చేయలేక పోతుంది హైదరాబాద్ జట్టు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది హైదరాబాద్ జట్టు పరిస్థితి. ఆ జట్టులో ఎంతో కొంత రాణిస్తున్నాడు అనుకుంటున్న వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన మ్యాచులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్యాట్.. బాల్ తో రాణిస్తున్న వాషింగ్టన్ సుందర్..

హైదరాబాద్ జట్టులో అతి కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే తమ స్థాయిలో రాణిస్తున్నారు. కీలక ప్లేయర్లు చేతులెత్తేస్తుండడంతో ఆ జట్టు పరాభవాన్ని మూట గట్టుకోవాల్సి వస్తోంది. రాణిస్తున్న ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ ఒకడు. ఇటు బాల్.. అటు బ్యాట్ రాణించగల సమర్థవంతమైన క్రికెటర్ సుందర్. తనదైన రోజున బ్యాటుతో మెరుపులు మెరిపించగల విధ్వంసకారుడు కూడా. అటువంటి కీలక ప్లేయర్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం కొద్దిరోజుల్లోనే సుందర్ కోలుకుంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ టీమ్ కు దూరమైతే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

జట్టులో కీలకమైన ప్లేయర్ కావడంతోనే..

జట్టులో మంచి ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ కు పేరు ఉంది. ఈ సీజన్లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో సందర్ 16 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మరో మ్యాచ్ లో 15 బంతుల్లో సుందర్ 24 పరుగులు చేశాడు, ఈ మ్యాచ్ లో బౌలింగ్ లోను సత్తా చాటిన సుందర్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి కీలకంగా మారాడు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఏడు పరుగులు తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ గా రాణించే సత్తా ఉన్న వాషింగ్టన్ సుందర్ టీమ్ కు గాయం కారణంగా దూరం కావడంతో అభిమానులతోపాటు జట్టు యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.