
Belly Fat: ఇటీవల కాలంలో అదిక బరువు సమస్య వేధిస్తోంది. మారుతున్న జీవన శైలితో ఊబకాయం వస్తోంది. చిన్న వయసులోనే పొట్ట పెరగడంతో అంకుల్ గా మారుతున్నారు. దీంతో నలుగురిలో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఆహార అలవాట్లు మార్చుకోవడం లేదు. ఫలితంగా రోజురోజుకు బరువు పెరుగుతున్నారు. పొట్ట పెరగడంతో అందవిహీనంగా కనిపిస్తున్నారు. దీనికి కొన్నినివారణ మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే కచ్చితంగా పొట్ట తగ్గుతుంది.
క్రమపద్ధతిలో ఆహారం తీసుకోవాలి
ఆహారం తీసుకోవడంలో పద్ధతి పాటించాలి. ఏది పడితే అది తింటే అంతే సంగతి. పొట్టకు కాస్త విరామం ఇవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు కూడా తినకూడదు. తినే సమయాలు కచ్చితంగా చూసుకోవాలి. లేచింది మొదలు నోట్లో వేసుకుంటూ పోతే ఇబ్బందులే. పొట్ట పెరగడం మామూలే. తినే విషయంలో జాగ్ర్తత్తలు పాటించాలి. దీంతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా..
నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫ్రైడ్ ఫుడ్స్ తో పొట్టకు ఇబ్బందులు రావడం సహజమే. శీతల పానీయాలు తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల కూడా బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. బరువును అదుపులో ఉంచుకునే ఆహారాలు తీసుకునేందుకు మొగ్గు చూపాలి.
అతిగా తినొద్దు
ఎప్పుడు కూడా అతిగా తినొద్దు. కొంచెం ఖాళీగా ఉంచుకుంటేనే మనం తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాని దొరికింది కదా అని వేలికి అందేవరకు తినడం సురక్షితం కాదు. మితంగా తినడమే మేలు. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తిన్నా నష్టం ఉండదు. కానీ తక్కువ సార్లు ఎక్కువ మొత్తం తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి.

వ్యాయామం తప్పనిసరి
ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రోజు వ్యాయామం చేయడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. పొట్టను తగ్గించుకునేందుకు పలు మార్గాలు పాటించాలి. అప్పుడే మనకు లాభాలు వస్తాయి. ఈ నేపథ్యంలో పొట్ట పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుని అధిక బరువు ముప్పును తప్పించుకోవచ్చు.