
Prabhas: హీరో ప్రభాస్ అత్యంత సిగ్గరి. అందుకే ఆయన మీడియా ముందుకు రాడు. పబ్లిక్ వేడుకల్లో పాల్గొనరు. తనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సిగ్గు, బిడియం ఆయన్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. వందల మందితో కూడుకున్న సన్నివేశాల్లో నటించాలంటే ప్రభాస్ కి ఇప్పటికి కూడా భయమేనట. ఆ సీన్స్ ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత మంచిదని భావిస్తారట. ఇది ఆయన దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారిందట. దాంతో రాజమౌళిని తిట్టుకుంటున్నారట. ప్రభాస్ చేసిన దానికి రాజమౌళిని తిట్టడమేంటని మీరు భావించవచ్చు.
దీని వెనుక ఆసక్తికర కారణం ఉంది. రాజమౌళి-ప్రభాస్ కాంబోలో ఛత్రపతి తెరకెక్కింది. 2005లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ మూవీలో ఓ ఐకానిక్ సన్నివేశం ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ ని అందరి ముందు చంపి ప్రభాస్ మరో డాన్ గా అవతరిస్తాడు. ఈ సన్నివేశంలో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్ నిల్చొని ఉంటారు. వాళ్లలో ధైర్యం నింపేలా ప్రభాస్ ఒక భారీ డైలాగ్ చెప్పాలి.
ఒక ప్రక్క వర్షం ఎఫెక్ట్, రాత్రి పూట చలి… దీంతో రాజమౌళిని ప్రభాస్ ఓ రిక్వెస్ట్ చేశాడట. నేను డైలాగ్ పెద్దగా చెప్పలేను, చిన్నగా చెప్తాను, షాట్ ఓకే చేయండి అన్నాడట. ప్రభాస్ కోరినట్లే రాజమౌళి షాట్ ఓకే చేశాడట. అక్కడున్న జూనియర్ ఆర్టిస్ట్స్ కి ప్రభాస్ ఎప్పుడు డైలాగ్ చెప్పాడో కూడా తెలియలేదట. అప్పటి నుండి ప్రభాస్ లో ఈ మొహమాటం మరింత ఎక్కువైందట. అదే అలవాటు ప్రతి సినిమాకు కొనసాగిస్తున్నాడట.

ప్రభాస్ తీరుకు లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ కూడా అసహనం వ్యక్తం చేశాడట. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో అందరి ముందు డైలాగ్ చెప్పడానికి ప్రభాస్ ఇబ్బందిపడ్డాడట. ఇలా అయితే ఎలాగయ్యా ఆర్టిస్ట్ అన్నాక ఓపెన్ గా డైలాగ్ చెప్పాలి. ఇలా సిగ్గుపడితే కుదరదని కే విశ్వనాథ్ అన్నారట. ప్రభాస్ మాత్రం అలవాటు మార్చుకోలేదట. దీనికంతటికి కారణం రాజమౌళినే. ఛత్రపతి సినిమాకే ఆయన ప్రభాస్ ని కట్టడి చేసి ఉంటే ఇలా జరిగేది కాదంటున్నారు.