December 31: 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నెలాఖరులోపు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ పనులను పూర్తి చేయని పక్షంలో ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నెలాఖరు లోపు ఆధార్ కార్డుతో యూఏఎన్ ను లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ తో లింక్ కావడం ద్వారా క్లయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ వేగవంతంగా జరుగుతుంది.
ఆధార్‌తో మీ యూఏఎన్ ను లింక్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా క్లయిమ్ ను పెట్టుకోవచ్చు. సెక్యూరిటీస్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా డీమాట్, ట్రేడింగ్ అకౌంట్ల కేవైసీ పూర్తి చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది. సెబీ నోటీసుల ప్రకారం డీమాట్, ట్రేడింగ్ అకౌంట్లకు కచ్చితంగా ఆరు కైవైసీ విషయాలను అప్ డేట్ చేయాలి. పదవీ విరమణ పొందిన వాళ్లు తప్పనిసరిగా డిసెంబర్ 31వ తేదీ లోపు వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి.
Also Read: క్రిస్మస్ ట్రీ పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా?
ఎవరైరే పదవీ విరమణను పొంది ఉంటారో వాళ్లకు ఈ డాక్యుమెంట్ ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఈ డాక్యుమెంట్ ను సమర్పించడం ద్వారా పెన్షన్ ను కంటిన్యూగా పొందే అవకాశం అయితే ఉంటుంది. సమయంలోగా ఈ డాక్యుమెంట్ ను సమర్పిస్తే పెన్షన్ ను కంటిన్యూగా పొందవచ్చని లేదంటే పెన్షన్ ను పొందడం సాధ్యం కాదని సమాచారం. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2021 సంవత్సరం డిసెంబర్ 31 చివరితేదీగా ఉంది.
పన్ను చెల్లింపుదారులు జరిమానాను తప్పించుకోవాలంటే నిర్ణీత సమయంలోగా ఐటీఆర్ ను దాఖలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ ఆర్థిక అంశాలకు సంబంధించిన ముడిపడిన టాస్కులను త్వరగా పూర్తి చేస్తే మంచిది.
Also Read: చలిగా ఉందని మద్యం తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?