https://oktelugu.com/

Anasuya: పుష్ప ది రైజ్​ కి అనసూయ పారితోషకం ఎంతో తెలుసా?

Anasuya Remuneration for Pushpa: తెలుగు యాంకర్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు అనసూయ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమా తో ఆమె సినిమా కెరియర్ ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. రంగస్థలంలో రంగమత్తగా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అనసూయ. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా “పుష్ప”ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. Also Read: […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 09:38 AM IST
    Follow us on

    Anasuya Remuneration for Pushpa: తెలుగు యాంకర్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు అనసూయ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమా తో ఆమె సినిమా కెరియర్ ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. రంగస్థలంలో రంగమత్తగా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అనసూయ. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా “పుష్ప”ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

    Anasuya Remuneration for Pushpa

    Also Read: ఆంధ్రాలో పుష్ప చిత్రానికి భారీ దెబ్బ…!

    అయితే” పుష్ప” సినిమా లో దాక్షాయని’ పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది అనసూయ. మొదటి భాగంలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు అనసూయ అందుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. ఈ చిత్రంలో అనసూయ దాక్షాయని పాత్రలో నటించేందుకు ఒక్కరోజుకే 1-1.5లక్షల రేమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట.

    మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట ఈ భామ. కాగా పుష్ప మొదటి పార్ట్ లో అనసూయ పాత్ర తక్కువగానే ఉన్నా సెకండ్‌ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్‌ కీలకంగా మారనుందని ఫాహద్‌ ఫాజిల్‌తో కలిసి పుష్ప పై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్‌ ఉండనుందని సమాచారం వినిపిస్తుంది. తమిళ మలయాళ పలు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

    Also Read: తగ్గేదే లే అంటున్న క్రికెటర్ రవీంద్ర జడేజా