Brahma Muhartam : బ్రహ్మ ముహూర్తంలో లేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

అలా కాకుండా రోజు ఈ సమయంలో లేవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒక 21 రోజులు లేస్తే.. మీరు ఎంత లేట్ గా పడుకున్న ఆ బ్రహ్మ ముహర్తంలో మీకు తెలియకుండానే తెలివి వస్తుంది. మరి మీరు ఇదే సమయంలో రోజూ లేస్తున్నారా.. అయితే మీకు కలిగిన మంచి ఫలితాలు ఏంటో కామెంట్ చేయండి.

Written By: NARESH, Updated On : September 12, 2024 9:31 pm

What are the benefits of getting up in Brahma Muhartam

Follow us on

Brahma Muhartam : ఈరోజుల్లో చాలా మంది ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలాంటప్పుడు మన అమ్మ, నాన్న ఇలా ఎవరో ఒకరు పొద్దున్న బ్రహ్మ ముహర్తంలో లేస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే మనలో చాలా మందికి ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో కూడా తెలీదు. ఈ సమయంలో లేస్తే నిజంగానే ప్రయోజనాలు ఉన్నాయా.. అంటే ఎక్కువ శాతం మంది ఉన్నాయనే చెబుతున్నారు. మరి ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

సూర్యోదయం కాకముందు నిద్ర లేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని మనం వింటూనే ఉంటాం. అయితే సూర్యోదయానికి 88 నిమిషాల ముందు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహర్తం అంటారు. అంటే సూర్యోదయానికి ఒక గంట 22 నిమిషాల ముందు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహర్తంలో చెబుతుంటారు. అయితే రోజు ఒకే సమయంలో బ్రహ్మ ముహూర్తం అనేది ఉండదు. ఆ రోజు క్యాలెండర్ తిథి ప్రకారం బ్రహ్మ ముహర్తం వస్తుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం, ఐశ్వర్యంతో పాటు జ్ఞానం కూడా వస్తుంది. ఈ సమయంలో లేచి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. ఇంట్లో కూడా అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. కోరిన కోరికలు నెరవేరాలంటే ఈ సమయం చాలా ముఖ్యమైనది. తప్పకుండా అనుకున్న పనులు అన్ని జరుగుతాయి. ముఖ్యంగా శివుడుని ఈ సమయంలో అభిషేకం చేసి పూజిస్తే.. వెంటనే కోరికలు నెరవేరుతాయి.

చిన్నప్పుడు పిల్లలకు గుర్తు ఉండాలంటే ఉదయాన్నే లేచి చదవండి అని చెబుతుంటారు. ఈ బ్రహ్మ ముహర్తంలో లేచి చదివితే అసలు మరిచిపోరు. ఈ సమయంలో చేసే పనులు అన్ని విజయాన్ని ఇస్తాయి. అయితే దీనికి మతంతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఈ సమయంలో లేచి.. వాళ్ల పనులు చేసుకోవచ్చు. కొందరికి బద్ధకంగా ఉండి.. అసలు ఏ పని కూడా చేయలేరు. అలాంటి వాళ్లు ఈ సమయంలో లేస్తే రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ప్రతి పని చేయగలరు. రోజురోజుకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. నేను ఏం చేయలేను అనే దగ్గర నుంచి ఏదయినా చేయగలను అనే వరకు వెళ్తారు. కొందరు కొన్ని రోజులు లేచి తరువాత మానేస్తారు. అలా కాకుండా రోజు ఈ సమయంలో లేవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒక 21 రోజులు లేస్తే.. మీరు ఎంత లేట్ గా పడుకున్న ఆ బ్రహ్మ ముహర్తంలో మీకు తెలియకుండానే తెలివి వస్తుంది. మరి మీరు ఇదే సమయంలో రోజూ లేస్తున్నారా.. అయితే మీకు కలిగిన మంచి ఫలితాలు ఏంటో కామెంట్ చేయండి.