Summer Health Tips: హాట్‌ సమ్మర్‌లో తాగాల్సిన చిల్డ్‌ బీర్లు ఇవే..

బీర్ల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే ఈ సీజన్‌లో మంచి టెస్ట్‌తోపాటు రిఫ్రెష్‌మెంట్‌ అందించే బీరు బ్రాండ్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Written By: Raj Shekar, Updated On : April 15, 2024 11:02 am

These are the chilled beers to drink in summer

Follow us on

Summer Health Tips: ఎండలు మండిపోతున్నాయి. ఈ సమ్మర్‌ మార్చి నుంచే మంట పుట్టిస్తోంది. తీవ్రమైన వేడి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడి తాపం నుంచి ఉపశమనం కోసం చాలామంది వివిధ రకాల డ్రింక్స్‌ తాగుతున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, ఇంకొందరు కూల్‌డ్రింక్‌ సేవిస్తుండగా మద్యం తాగే అలవాటు ఉన్నవారు బీర్లు లాగించేస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే ఈ సీజన్‌లో మంచి టెస్ట్‌తోపాటు రిఫ్రెష్‌మెంట్‌ అందించే బీరు బ్రాండ్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

కింగ్‌ ఫిషర్‌..
ఇది లైట్‌ బీర్‌.. మందుబాబులు దీనిని క్లాసిక్‌ బీర్‌ అంటారు. ఇది కొద్దిపాటి కిక్కుతో అద్భుతమైన రిఫ్రెష్‌ ఫీల్‌ ఇస్తుంది. మందుబాబులు దీన్ని క్లాసిక్‌ బీర్‌ అంటారు. ఇది కొద్దిపాటి కిక్కుతో అద్భుతమైన రిఫ్రెష్‌ ఫీల్‌ అందిస్తుంది. ఈ బీర్‌ను మంచి క్వాలిటీ ఉండే పదార్థాలతో సంప్రదాయ బ్రూయింగ్‌ పద్ధతుల్లో తయారు చేస్తారు. సాయంత్రం వేళల్లో బాల్కనీలో కూర్చుని ఈ బీర్‌ తాగుతుంటే ఉండే మజానే వేరు.

టుబర్గ్‌ బీర్‌
ఇది మీడియం స్ట్రెంత్‌ ట్రెడిషనల్‌ బీర్‌. సాఫ్ట్‌ టేస్ట్‌తో ప్రీమియం ఫీల్‌ ఇస్తుంది. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్‌తో శతాబ్దాల నాటి సంప్రదాయ బ్రూయింగ్‌ పద్ధతుల్లో టూబర్గ్‌ బీర్‌ తయారు చేస్తారు. ఈ వేసవిలో ఏదైనా ఈవెంట్లలో ఈ బీర్‌ తాగితే మంచి ఫీల్‌ ఉంటుంది.

మెడుసా ఎయిర్‌ మైల్డ్‌ బీర్‌..
ఇండియన్‌ బీర్‌ కంపెనీ మెడుసా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇటీవల లేటెస్ట్‌ ‘మెడుసా ఎయిర్‌’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది 4.5% ఆల్కహాల్‌ కంటెంట్‌తో లభిస్తుంది. ఈ కంపెనీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. క్యాన్‌లలో లభించే ఈ డ్రింక్‌ను సింపుల్‌గా క్యారీ చేయవచ్చు. పోర్టబిలిటీ, రీసైక్లబిలిటీ, ఫ్లెక్సిబులిటీ, హ్యాండ్లింగ్‌ సౌలభ్యాన్ని అందిస్తుంది. క్యాన్లు ఫ్రిజ్‌లో గాజు సీసాల కంటే వేగంగా చల్లబడతాయి. దీంతో విద్యుత్‌ వినియోగం తగ్గి పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది.

హీనెకెన్‌ బీర్‌..
ఇది స్ట్రాంగ్‌ బీర్‌. రిఫ్రెష్‌ రుచితోపాటు ఐకానిక్‌ గ్రీన్‌ బాటిల్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హై–క్వాలిటీ పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. ప్రత్యేకమైన ఈస్ట్‌ స్ట్రెయిన్‌, బార్లీ మాల్ట్, హాప్స్‌ మిశ్రమంతో ఇది ఐకానిక్‌ టేస్ట్‌ అందిస్తుంది. 192 కంటే ఎక్కువ దేశాల్లో హీనెకెన్‌ బీర్లను అమ్ముతున్నారు.