Sensational twist in the attack on Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో నాయకులపై వరుసగా రాళ్లదాడులు జరుగుతున్నాయి. తొలుత సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగింది. సానుభూతి కోసమే జగన్ తనకు తానుగా చేయించుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. కాదు కాదు దీని వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగానే ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెనాలిలో పవన్ పై రాళ్లదాడి వెలుగు చూసింది. అటు విశాఖలో చంద్రబాబు పర్యటనలో సైతం ఓ రాయి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాళ్ల దాడులను రాజకీయ పార్టీలు భూతద్దంలో పెట్టి విమర్శలు చేస్తుండగా.. సామాన్య జనాలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. పెద్దగా పట్టించుకోవడం కూడా లేదు.
అయితే పవన్ కళ్యాణ్ పై రాళ్లదాడికి సంబంధించి నిందితుడు పట్టుబడినట్లు ఒక న్యూస్ వైరల్ గా మారింది. అందులో సంచలన ట్విస్ట్ బయటపడింది. పవన్ కళ్యాణ్ సభలో రాయితో దాడి చేశాడని ఒక వ్యక్తిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. అయితే అది రాయి దాడి కాదని తేలింది. ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించిన తర్వాత తన మాటల్లో అసలు విషయం బయటపడింది. అయితే ఆ వ్యక్తి నిజంగానే పట్టుబడిన యువకుడా? లేకుంటే ఫేకా? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఆ యువకుడు చెబుతున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.’ నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని. పవన్ వాహనం దిగగానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ సమయంలో మహిళలు హారతులు ఇస్తున్నారు. ఆ సమయంలో నా చేయి వారికి తాకింది. అక్కడే ఉన్న ఒక పెద్దాయన అడ్డుకున్నారు. దాడికి దిగారు. ఈ క్రమంలో మరో పదిమంది వచ్చి నాపై చేసుకున్నారు. చివరకు ఒక వ్యక్తి రాయి వేశానంటూ చెప్పడంతో చిదకబాదారు’ జరిగింది ఇది అంటూ బాధిత యువకుడు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జనసైనికులు మాత్రం ఆ యువకుడు వైసీపీకి చెందిన వ్యక్తి అని.. రాయి దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది? పోలీసులే ధ్రువీకరించాలి.