TDP Janasena BJP Alliance: ఆ పది రోజులు కూటమికి ‘కీ’లకం

చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. ప్రచార పర్వం పై చర్చలు జరిపారు. ఈ 15 రోజులపాటు ఎవరికి వారే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Written By: Dharma, Updated On : April 15, 2024 11:38 am

Those ten days are crucial for TDP Janasena BJP Alliance

Follow us on

TDP Janasena BJP Alliance: ఏపీలో ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి విశాఖ వరకు వరుసగా భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు పవన్ వేదికలు పంచుకున్నారు. అప్పట్లో ఎన్డీఏకు ఒక ఊపు రావడానికి ఈ సభలు దోహదపడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా అదే ఊపు తేవాలని చంద్రబాబు భావించారు. కానీ చిలకలూరిపేట సభ తర్వాత ప్రధాని మోదీ కనిపించలేదు. బిజెపి అగ్ర నాయకత్వం కూడా ఏపీ పై దృష్టి పెట్టలేదు. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో.. మొదటి మూడు విడతల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలపైనే బిజెపి అగ్ర నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు నాలుగో విడత పోలింగ్ జరగనున్న తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఓ పది రోజులపాటు భారీ బహిరంగ సభలతో ఎలక్షన్ ఫీవర్ తెప్పించి.. ఎన్డీఏకు ఒక ఊపు తేవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. ప్రచార పర్వం పై చర్చలు జరిపారు. ఈ 15 రోజులపాటు ఎవరికి వారే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో మాత్రం ఉమ్మడి ప్రచార సభలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. మే 1 నుంచి 11 వరకు మాత్రం ఉమ్మడి ప్రచార సభలతో హోరెత్తించాలని చూస్తున్నారు. ఈ విషయంలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగళం యాత్ర చేపడుతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అటు పవన్ సైతంజనసేన పార్టీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రకారం చేస్తున్నారు.మధ్యలో చంద్రబాబుతో పాటు వేదికలు పంచుకుంటున్నారు. వీరితో పురందేశ్వరి జత కలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఉభయగోదావరి జిల్లాలో జరుగుతున్న ఉమ్మడి ప్రచార సభలకు ప్రజాస్పందన వస్తోంది. అందుకే దానిని కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.

మే 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో మే రెండు నుంచి మూడు పార్టీలు ఉమ్మడిగానే సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి వారి సభలకు మూడు పార్టీల నాయకులు హాజరుకావాలని నిర్ణయించారు. తద్వారా ఎన్డీఏకు ఒక ఊపు తేవాలని వ్యూహరచన చేస్తున్నారు. పది రోజులు పాటు ఉమ్మడి ప్రచారం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీని మార్చేది ఆ పది రోజులే నన్న నిర్ణయానికి వచ్చారు. అటు క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఉదయం పూట ఆన్లైన్, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉమ్మడి ప్రచారం చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికైతే మేలో ఆ పది రోజులు కీలకంగా భావిస్తున్నారు.