Dolo 650: కరోనా వైరస్ విజృంభించిన తర్వాత డోలో 650 ట్యాబ్లెట్ వాడకం ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు సైతం చాలామంది డోలో 650 ట్యాబ్లెట్ ను వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్ ప్రభావవంతంగా పని చేస్తుండటంతో పాటు తక్కువ ధరకే లభిస్తుండటంతో ఈ ట్యాబ్లెట్ ను వాడటానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ ట్యాబ్లెట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొంతమంది ఈ ట్యాబ్లెట్ కు సంబంధించిన మీమ్స్ తో నెట్టింట హడావిడి చేస్తున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్ ను వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వైద్యులు సూచిస్తే మాత్రం డోలో 650 ట్యాబ్లెట్ ను వాడాలి. నిద్రమత్తు, నీరసం, మైకం, ఇతర ఆరోగ్య సమస్యలు ఈ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్లను వేధించే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి.
డోలో 650 ఎక్కువగా వాడటం వల్ల కడుపులో వికారం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. డోలో 650 ట్యాబ్లెట్ ను ఎక్కువగా వాడితే మూత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. శరీరంలోని నాడీవ్యవస్థపై కూడా ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. ఇష్టానుసారం ఈ ట్యాబ్లెట్ ను వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.
జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకు మాత్రమే మందులు వాడాలి. చిన్నపిల్లలు డోలో 650 ట్యాబ్లెట్ ను వాడకూడదనే సంగతి తెలిసిందే. ట్యాబ్లెట్లను వాడటంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.