Pushpa
Pushpa: సినిమా అంటేనే మాయలోకం. ఒకరికి రావాల్సిన పేరు మరొకరికి వస్తోంది. ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు చేస్తారు. ఇండస్ట్రీలో మార్పులు చేర్పులు సర్వసాధారణం. అయితే, ఆ మార్పుల్లో కథలు ఉండొచ్చు, హీరోలు ఉండొచ్చు, హీరోయిన్లు ఉండొచ్చు. సహజంగా కథ రాసే సమయంలో తొలుత ఫలానా హీరో అయితే బాగుంటాడు అనిపిస్తోంది. కానీ, ఎన్నో లెక్కలు, మరెన్నో ఇగోలు.. ఇక చివరకు ఆఖరి నిమిషంలో హీరోలు మారతారు, పాత్రలు మారతాయి. అలాగే నిర్ణయాలు తారుమారవుతుంటాయి.
చాలా సినిమాల్లో ఇలా జరిగింది. జరుగుతూనే ఉంటుంది. మనం వింటూనే ఉంటాం. ‘పుష్ప’ విషయంలో కూడా ఇదే జరిగింది.
పుష్పకి మొదట హీరో మహేషే.. తర్వాతే బన్నీ వచ్చాడు !
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమా తీశాక.. దర్శకుడు సుకుమార్ మహేష్ కోసం మరోసారి ఈ పుష్ప కథ రాశాడు. ‘పుష్ప’ కథ మహేష్ కి చెప్పాడు కూడా. కానీ కథ మహేష్ కి నచ్చలేదు. దాంతో సుకుమార్ – మహేష్ కి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అలా మహేష్ చేయాల్సిన ‘పుష్పరాజ్’ పాత్రను అల్లు అర్జున్ చేశాడు.
Allu Arjun and Mahesh Babu
శ్రీవల్లి మొదట ‘సమంత’నే.. కానీ ఆ తర్వాత రష్మిక ఎంట్రీ ఇచ్చింది !
‘ఉ అంటావా.. ఊ ఊ అంటావా” అంటూ పుష్ప సినిమాలో సమంత తన ఐటమ్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. సుకుమార్ తీసిన ‘రంగస్థలం’లో ‘రామలక్ష్మీ’గా మెప్పించిన సామ్, ‘శ్రీవల్లి’గానూ నటించాల్సింది. సుకుమార్ ఆమెకు కథ కూడా చెప్పాడు. అయితే, అప్పట్లో పలు కారణాలతో సమంత ఈ సినిమా చేయలేదు. దాంతో రష్మికకు అదృష్టం పట్టుకుంది.
Samantha and Rashmika
అసలు ఊ ఊ అనాల్సింది సమంత కాదు, వాళ్లేనట..
సమంత చేసిన ఐటమ్ సాంగ్ ‘ఉ అంటావా.. ఊ ఊ అంటావా” అనే పాటలో మొదట అనుకున్నది సామ్ ని కాదు. మొదట బాలీవుడ్ భామలు దిశా పటానీ, బాహుబలి ఫేమ్ నోరా ఫతేహి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నారు. నోరానే చేస్తుందనే టాక్ వినిపించినా.. ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసింది. చివరి నిమిషంలో ప్రత్యేక గీతానికి సమంత సై అంది.
Bollywood Actress Disha Patani
Bahubali Fame Nora Fatehi
Also Read: నన్ను రేప్ చేయడం నాకు నచ్చలేదు – మాళవిక
పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ కంటే ముందు.. వాళ్ళను కూడా అనుకున్నారు.
ఇక పుష్పలో విలన్ గా విజయ్ సేతుపతి నటించాల్సింది. విజయ్‌నే మొదట భన్వర్‌లాల్ షెకావత్ పాత్ర కోసం అనుకున్నారు. విజయ్ డేట్స్ సర్టుబాటు కాలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నారా రోహిత్ పేరు కూడా వినిపించింది. ఆ పాత్ర చేయడానికి వాళ్లు ముందుకు రాలేదు. చివరికి మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ఓకే అన్నాడు.
Vijay Sethupathi
Also Read: సూపర్ స్టార్ కుమార్తెకు కరోనా పాజిటివ్ !
Nara Rohit