Zodiac Signs: సాధారణంగా భార్యాభర్తలు అయిన, స్నేహితులైన, కుటుంబ సభ్యులైన వారి మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పలు మనస్పర్థల కారణంగా బంధాలు విడిపోతాయి. ఇలా బంధాలు విడిపోయిన తర్వాత కొందరు మాత్రం వారితో తెంపుకున్న బంధాల కోసం ఎంతో బాధపడుతూ తిరిగి వారితో వారికున్న అనుబంధాలను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఇలా విడిపోయిన వారితో కలవడానికి ఈ రాశుల వారు ఏమాత్రం ఆలోచించకుండా వారి బంధాన్ని మరింత బలంగా మార్చుకుంటారు. మరి ఆ రాశులు వారు ఎవరు అనే విషయానికి వస్తే…
తులారాశి: తులారాశి వారు ఎంతో సహృదయం కలవారు. వీరికి ఎంతో మంచి మనసు ఉండటం వల్ల తొందరగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే వీరి నుంచి వీరు ఇష్టపడే వ్యక్తులు విడిపోతే వీరికోసం వారు తపన పడుతున్నారన్న విషయం తెలిస్తే వెంటనే వారిని తిరిగి తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు వారికి ఇష్టమైన వారితో ఎంతో ప్రేమగా ఉంటారు. కనుక తొందరగా వారి నుంచి విడిపోవాలని భావించరు. ఒకవేళ వీరికి ఇష్టమైన వారితో గొడవ పడిన లేదా వారు కనిపించకుండా పోయిన కర్కాటక రాశి వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారు కనుక వెంటనే ఈ రాశి వారు వారికి ఇష్టమైన వారితో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు.
మీనం: ఈ రాశి వారు వారి జీవితం పట్ల ఎంతో సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఇతరుల గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తారు. అలాగే వీరి నుంచి ఎవరైనా గొడవపడి విడిపోతే వారితో కలిసి పోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు.
Also Read: నిజమైన స్నేహితులలో ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి.. ఏవంటే?
కన్య రాశి: కన్య రాశివారిలో ఎంతో మొండితనం ఉండటం వల్ల తొందరగా ఇతరులపై కోపం ప్రదర్శిస్తారు. దీంతో ఆప్తులను కూడా కొన్నిసార్లు కోల్పోతారు.అయితే వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని తిరిగి వారితో కలిసి పోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఎంతో భిన్నమైన వారు వీరు జీవితంలోకి ఎవరైనా వస్తే వారి పై ఎంతో ప్రేమానురాగాలను పెంచుకుంటారు. వారి కోసం ఏమైనా చేస్తారు. అలాంటి వారు జీవితంలో దూరమైపోతే భరించలేరు కనుక వెంటనే మాజీల వద్దకు వెళ్లి వారి బంధాల్ని కొనసాగిస్తారు.
Also Read: మోక్షద ఏకాదశి అంటే ఏమిటి.. విష్ణుమూర్తిని ఎలా పూజించాలి?