Venkatesh: ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా ఆకట్టుకున్న ‘దృశ్యం’ నుంచి సీక్వెల్ గా వచ్చిన మరో ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. అయితే, ఈ చిత్రం, డిజిటల్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ లో ఒక తెలుగు సినిమాకు ఈ సినిమాకి వచ్చిన స్థాయిలో వ్యూస్ రాలేదు అట. పైగా వెంకీ కెరీర్ లో భారీ ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాగా ఈ సినిమాకి రికార్డ్ క్రియేట్ చేసింది.
నిజంగానే దృశ్యం 2 బాగుందా ? మొదటి భాగం చూసాక, రెండో భాగం మొదలు అంతా తండ్రి పాత్ర ఏమీ పట్టించుకోనట్లు ఉన్నా, థియేటర్ లో సీసీ టీవీ పెట్టించినప్పటి నుండి ఏదో ప్లాన్ లో ఉన్నాడని, అది ఎప్పుడు రివీల్ అవుతుందా అనే కోణంలో ప్రేక్షకుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆఖరున అనుకున్నట్టుగానే ఆ ఆసక్తి, ఆతృత డైరెక్టర్ ప్రేక్షకులకు కలిగేలా చేశాడు.
ముఖ్యంగా పెద్దమ్మాయి పాత్ర మానసికంగా ఎఫెక్ట్ అవడం, చిన్న అమ్మాయి కౌమారంలో సరదాగా బిహేవ్ చేయడం, తల్లి మాట విననట్టు గా ఉండడం, హీరో ఎదుగుదల చూసి చుట్టూ ఉన్న వారు అసూయ పడడం ఇవన్నీ నిజ జీవితానికి దగ్గరగా ఉండే విషయాలు. దాంతో దృశ్యం సినిమాకి సహజత్వం కావాల్సినంత దొరికింది. పైగా ఒక మధ్య తరగతి తండ్రి కుటుంబాన్ని కాపాడడం కోసం ఎంత తపన పడతాడు అనే అంశాన్ని కూడా బలంగా చూపించారు.
అయితే, దృశ్యం 2లో ఓ కొత్త పాయింట్ ఉంది. ఒక పుస్తకం రాయడం, స్క్రిప్ట్ వర్క్ కోసం ప్రముఖ రైటర్ ను కలిసి సలహాలు తీసుకోవడం, దాన్ని నిజ జీవితంలో అమలు చేయడం.. ఈ పాయింట్స్ అన్నీ కొత్తగా అనిపించాయి. మొత్తానికి దృశ్యం 2 కథనం చాలా బాగుంది. అందుకే ఈ సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించి ఉంటారు.
Also Read: Bheemla Nayak: రానాకు భీమ్లానాయక్ బర్త్డే ట్రీట్..డేనియల్ శేఖర్ వచ్చేది అప్పుడేనంటూ ట్వీట్
హత్య కేసు నుంచి రాంబాబు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడు ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో వచ్చే మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలోని మెయిన్ హైలైట్స్. సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.
Also Read: Bangarraju Movie: మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైన నాగార్జున బంగర్రాజు టీం…