Rahul Gandhi: పడిన చోటే లేచేందుకు.. రంగంలోకి రాహుల్

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముమ్మరంగా ముందుకు సాగుతున్నారు. పార్టీలో జవసత్వాలు నింపేందుకు నిమగ్నమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పార్టీని మళ్లీ అధికారం వైపు నడిపించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ, నయవాడ్ నుంచి పోటీ […]

Written By: Srinivas, Updated On : December 14, 2021 10:54 am
Follow us on

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముమ్మరంగా ముందుకు సాగుతున్నారు. పార్టీలో జవసత్వాలు నింపేందుకు నిమగ్నమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పార్టీని మళ్లీ అధికారం వైపు నడిపించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Rahul Gandhi

గతంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ, నయవాడ్ నుంచి పోటీ చేసినా అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో పరాభవం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి అమేథీ వైపు చూడలేదు. కానీ తన తాతల వారసత్వ నియోజకవర్గంగా వచ్చిన అమేథీ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చూస్తున్నారు. దీని కోసమ ఈనెల 18న అమేథీలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు పోటీలో నిలిచి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏమేరకు విజయం సాధిస్తుందో అని నేతల్లో అనుమానాలు వస్తున్నాయి. కానీ పార్టీకి పునర్వైభవం సాధించాలనే తాపత్రయంలో రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Russia-Ukraine war: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..?

రాహుల్ గాంధీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఈనెల 12న జైపూర్ లో సభలో పాల్గొని ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. .16న డెహ్రాడూన్ సభతో ఉత్తరాఖండ్ లో కూడా ఎన్నికల సభలో పాల్గొననున్నారు. దీంతో పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసే క్రమంలో రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద పర్యటించి పార్టీని బలోపేతం చేసే పనిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: Modi: కాశీలో మరణం కూడా మంచిదే.. ప్రధాని నోట సంచలన వ్యాఖ్యలు

Tags