Homeలైఫ్ స్టైల్Swastik Symbol: పుట్టు వెంట్రుక‌లు తీసేట‌ప్పుడు త‌ల‌మీద స్వ‌స్తిక్ గుర్తును ఎందుకు గీస్తారో తెలుసా...?

Swastik Symbol: పుట్టు వెంట్రుక‌లు తీసేట‌ప్పుడు త‌ల‌మీద స్వ‌స్తిక్ గుర్తును ఎందుకు గీస్తారో తెలుసా…?

Swastik Symbol: మ‌న హిందువుల సాంప్ర‌దాయాలు, ఆచారాల్లో చాలా ప్రాముఖ్య‌త‌లు దాగి ఉంటాయి. వీటిని చాలామంది ఆచారంగా భావిస్తుంటారు గానీ.. ఇందులో చాలా వ‌ర‌కు ఆరోగ్య క‌ర‌మైన విష‌యాలు కూడా దాగి ఉంటాయి. అయితే మ‌న‌కు స్వస్తిక గుర్తు గురించి తెలుసు. ఈ స్వ‌స్తిక్ గుర్తును శుభ సూచ‌కంగా భావిస్తుంటారు. ఇంట్లో ఏదైనా శుభ కార్య‌క్ర‌మాలు చేసే ట‌ప్పుడు దీన్ని పెట్టుకుంటారు.

Swastik Symbol
Swastik Symbol

వినాయ‌కుడికి ప్ర‌తీక కాట్టి దీన్ని శుభ సూచకంగా భావిస్తుంటారు. ఈ స్వస్తిక్ గుర్తు సూర్యుడి ప్ర‌తీక‌ను చూపిస్తుంద‌ని న‌మ్మ‌కం. కాగా చాలామంది శివువుకు పుట్టు వెంట్రుక‌లు తీసే స‌మ‌యంలో కూడా దీన్ని గీస్తారు. ఆరు నెల‌ల త‌ర్వాత శిషువుకు అన్న‌ప్రాస‌న చేస్తారు. ఆ త‌ర్వాత అంటే స‌రిగ్గా ఏడాది త‌ర్వాత శిషువుకు పుట్టు వెంట్రుక‌లు తీస్తారు.

Also Read: ఈ రెండు రాశుల వారికి సూర్య భగవానుని అనుగ్రహం !! వీరి కష్టాలనుంచి విముక్తి ఇందులో మీరున్నారా ?

ఇలా పుట్టు వెంట్రుక‌లు తీసే స‌మ‌యంలో శిషువు గుండు మీద స్వస్తిక్ చిహ్నాన్ని గీస్తారు. ఇలా స్వ‌స్తిక్ గుర్తు పెట్టిన త‌ర్వాత శిషువు నుదిటిపై బొట్టును పెడుతారు. అయితే ఇలా శిషువు గుండుపై స్వ‌స్తిక్ గుర్తు గీయ‌డానికి ఓ పెద్ద కార‌ణ‌మే ఉందంట. స్వస్తిక్ గుర్తు అంటే భ‌గ‌వంతుడి త‌లంపే శిషువు త‌లంపు అని భావించి ఇలా గుండుపై గీస్తారు.

స్వ‌స్తిక్ గుర్తు రాసిన త‌ర్వాత శిషువు గుండుపై గంధ లేప‌నాన్ని రాస్తారు. ఈ గంధ లేపనం మెద‌డును చ‌ల్ల‌బ‌రుస్తుంది. మెద‌డు జ్ఞానాన్ని బాగా పెంచుతుంద‌ని న‌మ్ముతుంటారు. ఇలా స్వ‌స్తిక్ గుర్తుతో చేసే ఈ కార్య‌క్ర‌మాన్ని చూడ‌క‌ర్మ సంస్కారం అంటారు. ఇలా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో శిషువును అంద‌రూ దీవిస్తుంటారు.

Also Read: చాణక్య నీతి ప్రకారం ధనవంతులు కావాలంటే చెయ్యకూడని తప్పులివే.. అవేంటంటే?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular