Indian Temples: భారతదేశం హిందూ సంప్రదాయాలకు పుట్టినిల్లు. హిందుత్వం అనేది మతం కాదు ఒక ధర్మం.. దీని ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన దైవాన్ని ఆరాధించవచ్చు. ఈ దేవుడినే పూజించాలి, మొక్కాలి అని నిబంధనలు ఏవీ ఇక్కడ ఉండవు. భారత గడ్డపై ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. ఎంతో మంది ప్రజలు నిత్యం దేవాలయాలకు వెళ్లి తమ కోరికలు, కష్టాలను తీర్చాలని ప్రార్థిస్తుంటారు. చాలా ఆలయాలు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంటాయి. పండుగలు, జాతరలు, కుంభమేళాలు జరిగే సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాయి. అయితే, దేశంలోని చాలా ఆలయాలు రోజు నిత్య అన్నదానం చేస్తూ నిరుపేదల ఆకలిని తీరుస్తున్నాయి. గూడు లేని చాలా మంది ఆలయాల వద్దే భోజనం చేసి అక్కడే ఎక్కడో తల దాచుకుంటుంటారు.
మనదేశంలో నిత్య అన్నదానం చేస్తూ నిరుపేదల కడుపు నింపుతున్న ఆలయాలు ఎక్కడెక్కడా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కర్ణాటక రాష్ట్రంలోని అన్నపూర్ణదేవి ఆలయం (హోరనాడు)కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది పురాతన దేవాలయం. అన్నపూర్ణదేవి ఆలయంలో నిత్యం వేలాది మందికి రుచికరమైన భోజనం అందిస్తారు. పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో కూడా చాలా మంది నిరుపేదలకు భోజనం అందిస్తుంటారు ట్రస్ట్ నిర్వాహకులు.
Also Read: వాటర్, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ గా ఉండటానికి కారణాలేంటి?
చపాతీతో పాటు పప్పు, కూరగాయల మెను ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌లోని హోమిస్ మోనాస్టరీ అనేది అతిపెద్ద మఠాల్లో ఒకటి. ఇక్కడ ఆకలితో వచ్చిన వారికి మంచి భోజనం అందిస్తారు. ఇకపోతే ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ కూడా భక్తులతో పాటు పేదలకు ఆహారం అందిస్తోంది. మహా హారతి పూర్తయ్యాక ఆహారం అందిస్తారు. షిర్డీ సాయిబాబా మందిర్ ట్రస్ట్ వారు వేల మందికి అన్నదానం చేస్తుంటారు. ఇక్కడ్ సోలార్ ఎనర్జీతో నడిచే పెద్ద వంటశాల ఉంది. 2000కు పైగా పప్పు ధాన్యపు రాశులతో వంటలు చేస్తుంటారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న తిరుపతిలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తుంటారు. ఇక్కడి వంటశాల కూడా సౌరశక్తితో నడుస్తోంది. కేవలం భక్తులకు వండి పెట్టేందుకు ఇక్కడ 1100 మంది వంట చేసేవారు ఉన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో కూడా భక్తులకు, పేదలకు పెద్దఎత్తున ఆహారం అందిస్తోంది. కోలకత్తాలోని దక్షిణేశ్వర్, బిహార్ లోని బాంకే బృందావన్ టెంపుల్ కూడా భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందిజేస్తుంది.
Also Read: దంతాలకు బ్రేస్‌లు అమర్చుకున్నారా.. ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!