Bath: నిత్యం కొన్ని పనులు తప్పకుండా చేయాల్సిందే. అన్నం తినడం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఆఫీస్ లకు వెళ్లడం, స్నానం చేయడం ఇలా చాలా పనులు ఉంటాయి. మరి ఇందులో స్నానం గురించి మాట్లాడుకుంటే.. కొందరు నగ్నంగా, మరికొందరు బట్టలతో స్నానం చేస్తుంటారు. అయితే స్నానం చేయడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పని. మరి ఈ స్నానం మీరు పూర్తి నగ్నంగా చేస్తున్నారా? అయితే జరిగే ఫలితాలు ఏంటో తెలుసుకుంటే నగ్నంగా స్నానం చేయరు.
వైదిక గ్రంధాలలో స్నానానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్నానం చేస్తున్న సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం నగ్నంగా స్నానం చేయకూడదట. దీని వల్ల జీవితంలో ఇబ్బందులు వస్తాయి అంటారు. ఇక పూర్తిగా నగ్నంగా స్నానం చేయడం అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. ఎక్కువ సేపు బట్టలు లేకుండా స్నానం చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయట. దీని వల్ల స్నానం చేసే వారి మనసు, ఇంటిపై ప్రభావం పడుతుంది.
బట్టలు లేకుండా స్నానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి కూడా గురి అవుతారట. అంటే నగ్నంగా స్నానం చేస్తే ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. డ్రెస్, చీర, చొక్కాలు కాకుండా కనీసం టవెల్ ఇన్నర్ వేర్ లు అయిన ధరించి మరీ స్నానం చేయాలి. నగ్నంగా స్నానం చేయడం వల్ల పితృదోషం కూడా వస్తుందట. ఇక గోపికలు స్నానం చేస్తున్నప్పుడు కృష్ణుడు వారి బట్టలను తీస్తాడు. అందుకే స్నానం చేసేటప్పుడు బట్టలు తీయవద్దు అంటారు. ఇలాంటి విషయాల్లో నమ్మకం లేకపోతే సైన్స్ పరంగా కూడా కొన్ని ఆలోచించవచ్చు.
ఒకప్పుడు మరుగుదొడ్డి ఇంటికి వెనుక ఉండేది. దీనివల్ల లోపలికి పురుగులు, పాములు వస్తే సడన్ గా బయటకు రాలేము. అందుకే బట్టలు ఉండాలి అంటారు. ఇక ప్రస్తుతం లేటెస్ట్ గా కొందరు దరిద్రులు టాయిలెట్స్ లో కెమెరాలు పెట్టడం వంటి వార్తలు వింటూనే ఉన్నాం. అలాంటప్పుడు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సో నూలు పోగు అయినా లేకుండా స్నానం చేయకండి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Taking a shower without clothes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com