The Exorcism: హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా జేమ్స్ కెమరాన్ తీసిన టైటానిక్,అవతార్, అవతార్2 సినిమాలు చేశారు. ఇలా ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే గ్లాడియేటర్ సినిమాలో అవార్డుని అందుకున్న రస్సెల్ క్రోవ్స్ నటించిన ది ఎక్సోర్సిజం అనే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే జూన్ 7వ తేదీన ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..’జై జాన్ మిల్లర్’ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా సినిమా మేకర్స్ ముందు నుంచే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే మరొక ఆస్కార్ అవార్డుని గెలుపొందాలని క్రోవ్స్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా వసూళ్ల పరంగా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇంతకుముందు హాలీవుడ్ సినిమాలన్నీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతూ వస్తున్నాయి. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ప్రతి హాలీవుడ్ సినిమా కూడా చాలా అద్భుతంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటాయి…
అయితే ఈ సినిమా ప్రస్తుతం ఉన్న జీవితానికి, గత జీవితానికి మధ్య ఉన్న ఒక పాయింట్ తో తెరకెక్కుతుంది. ఇక ప్రతి సంవత్సరం ఆస్కార్ రేస్ లో హాలీవుడ్ సినిమాల హవా కొనసాగుతూ వస్తుంది. మరి ఈ సినిమాతో ఆ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…