T20 World Cup 2022 India vs England: గెలుపు ఎన్ని సమాధానాలు ఇస్తుందో.. ఓటమి అన్ని ప్రశ్నలు మన ముందు ఉంచుతుంది. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారే.. ఓడిపోయినప్పుడు నిలదీస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఇండియా ఎదుర్కొంటున్నది. టి20 మెన్స్ వరల్డ్ కప్ సెమి ఫైనల్స్ లో ఇంగ్లీష్ టీం చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ ఆటగాళ్లు చాలామంది నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో సీనియర్ల రిటైర్మెంట్ అనేది తెరపైకి వస్తోంది. ఈ డిమాండ్ గత కొంత కాలంగా ఉన్నప్పటికీ.. సెమీస్ లో ఓటమి తర్వాత చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అసలు ఇది ఒక టీమేనా
లీగ్ దశలో మన వాళ్ల బౌలింగ్ చూశాక బంతులు వేస్తోంది భారత బౌలర్లేనా అనే లేదా అనే అనుమానం కలిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన వాళ్ళు వేసిన బౌలింగ్ చూస్తే గల్లీ స్థాయి అనిపించడం ఖాయం. బుమ్రా గాయంతో ఈ టోర్నీ కి కాలేజ్ ఎంపిక కాలేదు. అతడి స్థానంలో భారత పేస్ దళానికి నాయకత్వం వహించే సమర్థుడైన బౌలర్ లేకపోవడం దారుణం. నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. లైన్ అండ్ లెంగ్త్ తో బాల్స్ వేయడంతో ఒకానొక దశలో భారత్ కు పరుగులు రావడమే కష్టం అయింది. కానీ అదే దశలో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక్క కంటే ఒక్క వికెట్ తీయలేకపోయారు. బహుశా టీ 20 చరిత్రలో ఇంతటి దారుణమైన ఓటమిని ఇండియా ఇంతవరకు చూడలేదు. ఈ ఓటమి ఇండియా ను చాలా ఏళ్ల పాటు బాధిస్తూ ఉంటుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ ఓటమి భారాన్ని అందరూ మోయాల్సి ఉంటుంది.
విశ్రాంతి తీసుకోండి ప్లీజ్
ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత “సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది” అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 34 ఏళ్ల పై చిలుకు వయసు ఉన్నవాళ్లు మైదానంలో చురుకుగా కదల లేకపోతున్నారని.. ఇలాంటి సమయంలో కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నాయి.

ఇక త్వరలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో జరిగే సీరిస్ కు దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేయలేదు. ఇందులో భాగంగానే వారి ఎంపిక ను సెలక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇక తరచూ విఫలమవుతున్న రోహిత్ శర్మ ను కూడా టి20 లకు దూరంగా ఉంచాలని సీనియర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా సర్ఫరాజ్ అహ్మద్, సిరాజ్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. భారత క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోందని, ఇలాంటి సమయంలో ప్రతిభావంతమైన క్రీడాకారులకు అవకాశాలు ఇచ్చి టీం ఔన్నత్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.