Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఈసారి ఈ స్కామ్ కీలక సూత్రధారిపైనే ఈడి అధికారులు ఎక్కుపెట్టారు.. అరెస్టు కూడా చేశారు. ఇంకా మరి కొంతమంది లైన్లో ఉన్నారని హింట్ ఇచ్చారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది? ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? 100 కోట్ల ముడుపులు ఎవరికి చెల్లించారు? ఇందులో 64 కోట్ల మేర లబ్ది శరత్ రెడ్డికి ఎందుకు దక్కింది?

5 రిటైల్ జోన్లు
శరత్ రెడ్డి తన గ్రూపు ట్రైడెంట్ కేమ్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, బినామీ కంపెనీలయిన
ఆర్గానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా 5 రిటైల్ జోన్లను నిర్వహించారు. నిజానికి ఏ వ్యక్తి కూడా రెండు రిటైల్ జోన్లకు మించి నిర్వహించకూడదు. బినామీ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టి ఈ ఐదు జోన్లనూ ఆయనే నిర్వహించారు. ఆ మూడు కంపెనీల ఆర్థిక వ్యవహారాలు కూడా ఆయనే నిర్వహించారు. ఢిల్లీలోని మద్యం ఉత్పత్తిదారులు, హోల్ సేలర్లు, రీ టెయిలర్స్ తో కూడిన అతిపెద్ద కార్టెల్ సౌత్ గ్రూప్ అనే కంపెనీ పేరు గడించింది. ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో 30% వాటా దీనిదే. ఇందులో శరత్ రెడ్డి కీలక భాగస్వామి.. ఇందులో మరో భాగస్వామి సమీర్ మహేంద్రు.. దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటైన “ఫెర్నాడ్ రికార్డు”తో పాటు ఇతర మద్యం తయారీ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి.. ఫెర్నాడ్ రికార్డ్ తన హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ గా ఇండో స్పిరిట్స్ ను పెట్టుకుంది. ఇది సమీర్ మహేంద్రు, అరుణ్ కుమార్, ప్రేమ్ రాహుల్ ది. ఇతరులతో పాటు బినామీల ద్వారా శరత్ చంద్రారెడ్డికి కూడా ఇందులో వాటా ఉంది.

ముడుపులు తీసుకున్నారు
శరత్ రెడ్డి ఆధ్వర్యంలో సౌత్ గ్రూప్ బినామీల ద్వారా 9 రిటైల్ జోన్లు నిర్వహించింది. ఇది మద్యం పాలసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ట్రైడెంట్, అర్గనోమిక్స్, అవంతిక ద్వారా ఐదు రిటైల్ జోన్లను శరత్ నిర్వహించారు. కార్టెల్ లోని ఇతర సభ్యులతో కలిసి మరో నాలుగు జోన్లు నిర్వహించారు. బినామీలు, ముడుపులు ఇవ్వడం, అక్రమ లావాదేవీల ద్వారా లిక్కర్ మార్కెట్ ను శాసించారు. విజయ్ నాయక్ ద్వారా సౌత్ గ్రూప్ కార్టెల్ , ఇతర రిటైల్ జోన్లు 100 కోట్ల ముడుపులు చెల్లించాయి. హోల్ సేల్ కంపెనీ కనుక ఆయా రిటైల్ జోన్ నుంచి తొలుత ఇండోర్ స్పిరిట్స్ ముడుపులు వసూలు చేసింది.. ఇక శరత్ రెడ్డి సంస్థలకు ఇండస్ స్పిరిట్స్ తనకు తానుగా అదనపు క్రెడిట్ నోట్లను జారీ చేసింది.. ఇక ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వెలుగు చూసే వాస్తవాలు ఎన్నో.