Bigg Boss 6 Telugu- Rohit vs Revanth: ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘ల్యాడర్ vs స్నేక్స్’ గేమ్ చివరి అంకం కి చేరుకుంది..ఈ చివరి రౌండ్ పేరు ‘వస్తా నీ వెనుక’..ఇందులో కెప్టెన్సీ పోటీదారులందరు థెర్మో కోల్ బాల్స్ తో నిండియున్న బస్తాలను భుజానికి తగిలించుకొని సర్కిల్ లోపల ఒకరి వెనుక ఒకరు తిరుగుతూ ఉండాలి..ఈ క్రమం లో ఒకరి మీద ఒకరు దాడి చేసి థెర్మో కోల్ బాల్స్ ని క్రింద పడేయొచ్చు..ఈ టాస్కుకి సంచాలకులుగా రేవంత్ వ్యవహరించాడు..ఈ టాస్కు చూసిన ఎవరికైనా రేవంత్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడని అర్థం అయ్యిపోతాది..రూల్స్ అతనికి నచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళాడు.

దీనిని శ్రీ సత్య ముందు నుండి హెచ్చరిస్తూనే ఉంది..కానీ రేవంత్ వినిపించుకోకుండా తన ఇష్టం అన్నట్టు వ్యవహరించాడు..దీనికి ఈ వారం అతనికి నాగార్జున గారి చేతిలో కోటింగ్ తప్పేలా లేదు..ఇక ఈ టాస్కులో రేవంత్ సంచలాక్ గా ఫెయిల్ అయ్యేసరికి అతని వల్ల నష్టపోయిన రోహిత్ తీవ్రమైన ఆగ్రహానికి గురైయ్యాడు.
బిగ్ బాస్ టాస్కు మధ్యలో చేతులతో బస్తాని ముట్టుకోకూడదు అని రూల్ పెడుతాడు..ఒక్కసారి బిగ్ బాస్ రూల్ చెప్పాడంటే సంచాలక్ అది కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే..అయితే ఆది రెడ్డి బస్తాని పదేపదే పెట్టుకుంటున్నాడు అని రేవంత్ కి చెప్తున్నా కూడా అతగాడు గమ్మున చూస్తూనే ఉన్నాడు కానీ ఆది రెడ్డి ని గేమ్ నుండి తొలగించలేదు..అవతల రోహిత్ ఏమో పాపం బస్తాని ముట్టుకోకుండా బిగ్ బాస్ చెప్పిన రూల్ ని ఫాలో అవుతూ థెర్మో కోల్ బాల్స్ ని మొత్తం పోగొట్టుకున్నాడు..ఇక్కడ సంచాలక్ గా రేవంత్ న్యాయంగా వ్యవహరించకపోవడం తో రోహిత్ కోపం కట్టలు తెంచేసుకుంది..బస్తని నేలకేసి కొట్టి తర్వాత కోపం తో కాళ్లతో తంటాడు..ఇది చూసి రేవంత్ తో పాటు ఇంటి సభ్యులందరు ఒక్కసారిగా షాక్ కి గురవుతారు..ఎందుకంటే రోహిత్ ని అంత కోపంగా ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా చూడలేదు కాబట్టి.

‘నేను కూడా అగ్రెసివ్ అయ్యాను కానీ..ఇలా బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీ ని కాళ్లతో కొట్టి..నోటికి వచ్చినట్టు మాత్రం ఎప్పుడు మాట్లాడలేదని’ రేవంత్ బిగ్ బాస్ కి కంప్లైంట్ చేస్తాడు..ఇక ఆ తర్వాత రోహిత్ భార్య మరీనా రోహిత్ కి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది..అప్పుడు రోహిత్ ‘ఓవర్ యాక్షన్ చెయ్యకు..చెంప పగలగొడతాను’ అంటూ వార్నింగ్ ఇస్తాడు.