https://oktelugu.com/

Debt: అప్పులతో బాధ పడుతున్నారా? శివుడి ముందు చిన్న మంత్రం చాలు..

పెరుగుతున్న అవసరాల దృష్ట్యా జీతాలు సరిపోక, వచ్చే ఆదాయం తక్కువ ఉండడంతో అప్పులు చేస్తుంటారు. అప్పులు చేయడం సులభమే కానీ వాటిని తీర్చడమే చాలా కష్టం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 6, 2024 / 01:08 PM IST

    Suffering from debt but do this

    Follow us on

    Debt: ప్రతి పని నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది. ఇక జ్యోతిష్యాలను నమ్మేవారు కొందరు అయితే నమ్మనివారు కొందరు. ఇదిలా ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయి. వాటిని పాటించడం వల్ల సమస్యలు తొలిగిపోతాయి అంటారు పండితులు. ఇప్పుడు చాలా మందిని వేధించే సమస్య అప్పు. మీరు కూడా అప్పుల సమస్యతో సతమతం అవుతున్నారా? అయితే ఓ చిన్న మంత్రం చాలు అంటున్నారు పండితులు. ఇంతకీ వారు చెప్పే ఆ మార్గం ఏంటో ఓ సారి తెలుసుకోండి.

    పెరుగుతున్న అవసరాల దృష్ట్యా జీతాలు సరిపోక, వచ్చే ఆదాయం తక్కువ ఉండడంతో అప్పులు చేస్తుంటారు. అప్పులు చేయడం సులభమే కానీ వాటిని తీర్చడమే చాలా కష్టం. ఒకసారి అప్పు చేయడం అలవాటు మారితే కొందరికి వ్యసనంగా కూడా మారుతుంటుంది. కానీ తీసుకున్న అప్పు చెల్లించే వరకు మరొక అప్పు జోలికి వెళ్లకపోవడమే బెటర్. అయితే అప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే ఒక పరిష్కారం ఉంది అంటున్నారు జ్యోతిష్యులు. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా?

    సోమవారం శివుడిని పూజిస్తారు. అయితే ఆ దేవదేవున్ని పూజించడానికి ఒకరోజు ఏంటి? ప్రతి రోజు శుభప్రదమే. అయితే మంగళవారం రోజు శివాలయానికి వెళ్లి 9 ప్రదక్షిణలు చేయాలి. అంతే కాదు ఒక చిన్న మంత్రం చదివితే మీ అప్పులు తొందరగా తీరుతాయి అంటున్నారు పండితులు. ఈ మంత్రాన్ని ప్రదక్షిణలు చేస్తూనే చదవాలి. మరి ఆ మంత్రం ఏంటి అని వెయిట్ చేస్తున్నారా. ఓం రుణ ముక్తేశ్వర మహాదేవాయ నమః: కేవలం ఈ చిన్న మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేస్తే మీరు అప్పుల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందట.