Stressless life : స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్.. చాలామంది ఇప్పుడు ఇదే ఒత్తిడితో బాధ పడుతున్నారు. ఎవరిని చూసినా ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. చదువు, పిల్లలు, ఉద్యోగం, లైఫ్, ప్రజెంట్, ఫ్యూచర్, ఉద్యోగం, కెరీర్ ఇలా ఏదో ఒక విధమైన టెన్షన్ మాత్రం పక్కా అనే విధంగా ఉంటుంది. ఈ ఒత్తిడి వల్లనే అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. గుండె సంబంధ సమస్యలు, మానసికంగా కుంగి పోవడం, తలనొప్పి, మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. 20లో 60లా కనిపించడం, జుట్టు పోవడం వంటివి ఎన్నో వస్తాయి. అందుకే ఒత్తిడి లేకపోతే మీరు హ్యాపీ. ఇంతకీ ఒత్తిడి నుంచి దూరం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఒకసారి ఈ ఆర్టికల్ చదివేయండి.
Also Read: వారంలో ఎన్ని సార్లు ఆకుకూరలు తినాలి? ఎన్ని సార్లు కూరగాయలు తినాలి? పర్ఫెక్ట్ డైట్ ఏది?
సోషల్ మీడియా: సగం దరిద్రం అందులోనే ఉంటుంది. ఎదుటి వారి లైఫ్ ను చూసి మనకు అలాంటి లైఫ్ లేదు అనుకోవడం, డబ్బు సంపాదించాలనే దురాశ, ఎంజాయ్ వంటి అనవసరైమన అలవాట్లు వీటి వల్లనే వస్తాయి. అవి లేకపోతే కుంగిపోయి తెగ టెన్షన్ పడుతుంటారు. లైఫ్ కు అసలు అర్థమే లేదు అని తెగ ఫీల్ అవుతుంటారు. అసలు మనది కూడా ఒక లైఫా అంటూ బాధ పడతారు. సినిమాలు, సీరియల్స్, కొందరి ఇంటి, ట్రిప్ వ్లాగ్స్ కూడా చాలా మందిని నిరాశలోకి నెట్టేస్తున్నాయి. అందుకే ముందుగా ఈ దరిద్రానికి దూరం అవ్వండి అంటున్నారు నిపుణులు. అవసరం అయినవి మాత్రమే చూసి ఆ ఫోన్ ను పక్కన పెట్టండి.
దూరం: మీ లైఫ్ లో మీ చుట్టు అవసరమైన వారు ఉంటారు. నార్మల్ పీపుల్స్ ఉంటారు. అనవసరమైన వారు కూడా ఉంటారు. అవసరమైన, కామన్ పీపుల్స్ తో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ అనవసరమైన వారితో లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో జాగ్రత్త. మీ మనశ్శాంతిని కూడా వారు లాగేసుకుంటారు. జాగ్రత్త. వీరిని వీలైనంత దూరం పెట్టండి.
Also Read :విశ్వంభర’ విడుదలకు లైన్ క్లియర్..పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక నిరాశే!
స్నేహితులు: స్నేహితులు కుప్పలు కుప్పలు ఉంటారు. కానీ అందులో నీ మేలు కోరే వారు ఎవరు? నీ చెడు కోరే వారు ఎవరు? నీ కష్టాల్లో తోడు వచ్చేది ఎవరు? నీతో నిలిచేది ఎవరు? అనే విషయం మీద నీకు కచ్చితంగా క్లారిటీ ఉండాలి. మంచి స్నేహితులను వదులుకోకు. చెడు స్నేహితులను వదిలి సంతోషకరమైన జీవితాన్ని సాగించు. లేదంటే ఆ స్నేహాల వల్ల నువ్వు అనుకోని చెడు సావాసాలతో జీవితాన్ని నాశనం చేసుకునే రోజు కూడా రావచ్చు. ముందే జాగ్రత్త.
వద్దు, కాదు: కొందరు వద్దు, లేదు, కాదు అనే మాటలు చెప్పడానికి చాలా వెనకాడుతారు. భయపడతారు. ఇబ్బంది పడతారు. కానీ ఎందుకు అంత టెన్షన్. దేనికి మీరు మొహమాట పడుతున్నారు. ఈ సమస్య వల్ల మీరు మీ లైఫ్ ను కోల్పోవాల్సి వస్తుందని గుర్తించారా? ఇప్పటికీ అయినా మంచి పోయింది లేదు. లేదు, కాదు లు నేర్చుకోండి. కాస్త మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.