Harish Rao: కాంగ్రెస్ పార్టీ పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బేసిన్లు, బేసిక్లు తెలియని వ్యక్తులు సీఎం, మంత్రులు అయ్యారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు కాళేశ్వరం ప్రాజెక్టు పై అదనపు సమాచారం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీళ్లను ఏపీకి ఇస్తున్నారని విమర్శించారు.
బేసిన్లు తెలవనోడు ముఖ్యమంత్రి అయ్యిండు..బేసిక్‌లు తెలవనోడు నీళ్ల మంత్రి అయ్యిండు – హరీష్ రావు pic.twitter.com/hBc2y51dTd
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025