The 100 Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట రాబోయే సినిమాలతో మన స్టార్ హీరోలందరు భారీ విజయాలను సాధించాలనే సంకల్పం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక మొగలిరేకులు(Mogali Rekulu) సీరియల్ తో ఆర్కే నాయుడు(RK Naidu) గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సాగర్ (Sagar)…ఆయన హీరోగా మారి పలు సినిమాలు చేసినప్పటికి అవేవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాయి. ఇక రీసెంట్ గా ‘ది 100‘ (The 100) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో సక్సెస్ ను సాధించాడా? లేదా ఈ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: మన హీరోలు డ్యూయల్ రోల్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారా..?
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న సాగర్ తన ఏరియాలోని కొన్ని ఇండ్లల్లో దొంగతనం జరుగుతుంటాయి. ఇక ఆ ఇంట్లోనే కొన్ని మర్డర్స్ అయితే జరుగుతాయి. మరి ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు? అసలు దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్లకు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని దర్శకుడు ‘రాఘవ్ ఓంకార్ శశిధర్ ‘ (Raghav Omkar Shashidhar) ఈ సినిమాను ఇంటెన్స్ డ్రామాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు నడిపించాడు. ప్రతి సీన్ ని ఇంట్రెస్టింగ్ మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ లేనప్పటికి సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఎంగేజింగ్ గా అనిపించడమే కాకుండా ఒక గుడ్ అటెంప్ట్ చేశారనే ఫీల్ అయితే కలుగుతోంది.
ఈ మధ్యకాలంలో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం లేదు. ఇక ఇలాంటి సందర్భంలో దర్శకుడు రాసుకున్న ఒక కథకు కట్టుబడి ఆ కథ తో ప్రేక్షకుడికు ఏ మాత్రం బోర్ కొట్టించకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మైమరిపింప చేస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి…
హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు చాలా వరకు హెల్ప్ అయ్యాయి… ఇక ఈ సినిమాలో ట్విస్టు లు కూడా చాలా బాగుండడంతో ఎవరు గెస్ చేయలేని ట్విస్ట్ లను ఇందులో పొందుపరిచి ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తిని రేకెత్తించారు. ముఖ్యంగా క్లైమాక్స్ వరకి ఒక ట్విస్ట్ అయితే ఎంగేజింగ్ గా తీసుకెళ్లి క్లైమాక్స్లో రివిల్ చేసిన విధానం బాగుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నటుడు సాగర్ మొగలిరేకులు సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే ఆయన ఆ రేంజ్ లో మరోసారి మెరవలేకపోయాడు. కానీ ఇప్పుడు ఈ సినిమాతో మంచి నటుడిగా మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకోవడమే కాకుండా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు…
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో తను ఒదిగిపోయి నటించాడు… ధన్య బాలకృష్ణ కూడా తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. మిషా నారంగ్ కూడా సెటిల్డ్ పర్ఫామెన్స్ ని ఇచ్చి సినిమా సక్సెస్లో కీలకపాత్ర వహించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. ప్రతి సీన్ కి బ్యాక్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా అందించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ గాని, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అందించిన నేపథ్య సంగీతం సూపర్ గా ఉండటంతో సీన్ కూడా టాప్ లెవల్ లోకి వెళ్ళిపోయింది… ఇక సినిమా కలర్ ప్యాలెట్ విషయంలో కొంతవరకు నిర్లక్ష్యం అయితే వహించారు.
Also Read: రాజమౌళి బాటలో సందీప్ రెడ్డి వంగ.. మామూలు ప్లానింగ్ కాదుగా…
ఫస్ట్ ఆఫ్ లో సినిమా కొత్తవరకు షార్ట్ ఫిలిం చూసినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం కలర్ పాలెట్ ను బాగా యూస్ చేసుకున్నారు. అది మొదటి నుంచి కూడా పర్ఫెక్ట్ టెంప్లేట్ లో ఉంటే బాగుండేది… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంకాస్త మెరుగ్గా ఉంటే సినిమా అవుట్ పుట్ మరింత భారీ రేంజ్ లో వచ్చి ఉండేది…
ప్లస్ పాయింట్స్
కథ
సాగర్ యాక్టింగ్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
కొన్ని అనవసరపు సీన్స్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5