Weekly diet plan: మీరు రోజు కూరగాయలు తింటారా? మరి తినాల్సిందే కదా. రోజు వంట చేయాల్సిందే కదా. రోజు రెండు సార్లు వంట చేస్తారా? రైస్ చేయకున్నా చపాతీలోకి కూడా కర్రీ ఉండాలి. అంటే కూరలు వండాలి. మరి ఆకుకూరలా? కూరగాయలా? అయితే ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందువల్ల, అందరూ తమ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. అయితే ప్రతి రోజు కూరగాయలు తింటారు చాలా మంది. వారంలో ఒకసారి లేదా అప్పుడప్పుడు మాత్రమే ఆకుకూరలను వండుతారు. కానీ కూరగాయల కంటే కూడా ఆకుకూరలు చాలా బెటర్ అంటున్నారు నిపుణులు. ఏ సీజన్ లో అయినా సరే వీటిని తినవచ్చు. అంటే ప్రతి సీజన్‌లో ఆకుకూరలు తినాలి. ఇక శీతాకాలంలో ఆకుకూరలు సులభంగా లభిస్తాయి. శీతాకాలంలో వాటిని తీసుకోవడం కూడా ప్రయోజనకరం. ఇప్పుడు వర్షాకాలం కదా. ఈ సమయంలో కూడా బాగానే ఉంటాయి.
Also Read: మీ ఫ్రెండ్ ఎప్పుడూ సైలెంట్ గా ఉంటున్నారా? అతనికి క్యారెక్టర్ ఇదే..
ఆకుకూరలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. మీరు మీ శీతాకాలపు ఆహారంలో ఆకుకూరలను కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి కూరగాయల్లో లభించేకంటే మూడు నుంచి 4 రెట్లు ఎక్కువగా ఆకుకూరల్లో లభిస్తాయి. అంతేకాదు శరీరానికి కావాల్సిన లవణాలు కూడా ఈ ఆకుకూరల్లో లభిస్తాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. కూరగాయల్లో కంటే ఇవి ఆకుకూరల్లోనే 3 నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి.
ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే ఉంటాయి. అంతేకాదు నూనె, మసాలా వంటివి కూడా ఈ ఆకుకూరల వల్ల సేవ్ అవుతాయి. ఈ ఆకుకూరలకు మసాలా, నూనె వంటివి చాలా తక్కువ అవసరం. ఇందులో మసాలా అసలు వేయరు. కొందరు వంకాయ, ఆలు, దొండకాయ, బీరకాయ వంటివి కూడా మసాలా చేసి చేస్తుంటారు. రుచి బాగుంటుంది కానీ ఆరోగ్యం కూడా మస్ట్ కదా. సో ఈ ఆకుకూరలకు మాసాలా పెట్టాలనే ఆలోచన కూడా ఉండదు. అందుకే కూరగాయల కంటే కూడా ఆకుకూరలు ఎక్కువ తినడం బెటర్ అంటున్నారు నిపుణులు.
Also Read: గ్రీన్ టీ తాగేవాళ్లు, తాగని వారు ఇది తెలుసుకోవాలి.. లేకుంటే డేంజర్లో పడుతారు
కొన్ని ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, రాగి, మాంగనీస్, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. మీరు అలాంటివి తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించుకోవచ్చు. కాల్షియం, మెగ్నీషియంలు ఎముకలను బలంగా చేస్తాయి. వీటి వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి ఉంటుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.