Animal Husbandry: భారతదేశంలో ఎక్కువ ఉపాధిని కల్పించే రంగాలలో పాడిపరిశ్రమ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలను చేపడుతోంది. పాడి పరిశ్రమ అనుబంధ పరిశ్రమల యొక్క లాభాలను తగ్గించడానికి పాడి పరిశ్రమ రంగాన్ని వ్యవస్థీకృతం చేయడానికి కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా కేంద్రం ఈ రంగానికి స్టార్టప్ లను అనుసంధానించాలని భావిస్తోంది.
ఇందుకోసం కేంద్రం స్పెషల్ కాంటెస్ట్ ను నిర్వహిస్తుండగా స్టార్టప్ లు ఆరు విభిన్న సవాళ్లను ఎదుర్కోనున్నాయని తెలుస్తోంది. ‘యానిమల్ హస్బెండరీ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’ పేరుతో డెయిరీ మంత్రిత్వ శాఖ సెకండ్ ఎడిషన్ ను మొదలుపెట్టగా పాడి పరిశ్రమ, పశు పోషణకు సంబంధించిన సమయలను పరిష్కరించడానికి కొత్త ఆలోచనలను కనుగొనడం దీని ప్రధాన లక్ష్యమని చెప్పవచ్చు.
Also Read: రోజుకు రూ.20 డిపాజిట్ చేస్తే కోటీశ్వరులయ్యే ఛాన్స్.. ఎలా అంటే?
www.startupindia.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ పోటీలో సులభంగా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఈ పరిశ్రమతో అనుబంధాన్ని కలిగి ఉండి ఏదైనా కొత్త ఆలోచనతో పని చేస్తుంటే ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాల సరఫరా నిర్ధారించడం, జంతువుల సంఖ్యను పెంచడం, టెక్నాలజీని గుర్తింపు కోసం మొదలైనవి ఉంటాయి. ఈ పోటీలో ఆరు సవాళ్లు ఉండగా విజేతకు 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు.
ఈ పోటీలో రన్నరప్ కు 7 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. ఈ పోటీలో గెలిచిన వాళ్లు పెట్టుబడిదారుల ముందు తమ ఆలోచనలను పంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి మంత్రిత్వ శాఖ నిపుణులను కూడా నియమించనుంది.
Also Read: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?