Balakrishna: రాయలసీమకు జరుగుతున్న ఆన్యాయమే బాలయ్య కథ !

Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమా షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. జనవరి 18 నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ కానుంది. ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని బాగానే కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంగా కథ పై బాగా వర్క్ చేస్తున్నాడు. అయితే, ఇప్పటికే ఈ సినిమా కథ ఇది అంటూ ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపించింది. ఈ కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. […]

Written By: Shiva, Updated On : December 16, 2021 1:27 pm
Follow us on

Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమా షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. జనవరి 18 నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ కానుంది. ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని బాగానే కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంగా కథ పై బాగా వర్క్ చేస్తున్నాడు. అయితే, ఇప్పటికే ఈ సినిమా కథ ఇది అంటూ ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపించింది.

Balakrishna Gopichand Malineni

ఈ కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని గతంలో బాగా వినిపించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చెబుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలో రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట.

అలాగే.. ఈ సినిమాలో బలమైన విలనిజమ్ ఉన్న పాత్రలు కూడా ఉన్నాయట. ముఖ్యంగా విలన్ పాత్రలు చాలా కీలకం. అందుకే, విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిను తీసుకున్నారు. అదే విధంగా కన్నడ నటుడు దునియా విజయ్. ముఖ్యంగా విలన్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. దునియా విజయ్ ను కూడా ఒక విలన్ గా ఫైనల్ చేశారు.

Also Read: Pushpa: పుష్ప ఫెస్టివల్​కు అంతా సిద్ధం.. భారీ సంఖ్యలో థియేటర్లు లాక్​

నట సింహం కి పోటీగా డైలాగులు చెప్పాలంటే లీడింగ్ లో ఉన్న యాక్టరే కావాలి, అందుకే వీళ్ళను ఎంపిక చేశారు. ఓ దశలో తమిళ విలక్షణ కథానాయకుడు విజయ్ సేతుపతిను కూడా బాలయ్యకు విలన్ గా ఒప్పించాలని ప్రయత్నాలు చేశారు గాని, అది వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా హైలైట్ గా ఉంటాయట.

ఇక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రానుంది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది.

Also Read: Arjuna Phalguna: శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’ సినిమా విడుదల తేదీ ఖరారు

Tags