Vastu Tips: ప్రస్తుత కాలంలో డబ్బు చాలా ముఖ్యం. డబ్బు లేనిదే ఏ పని జరిగే పరిస్థితులు లేవు. దీని లోటు వలన అనేకసార్లు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి తెలిసిందే. అయతే మనలో చాలా మంది ఇంటిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంట్లో ఇకపై డబ్బే డబ్బే. ఇంతకీ అదేంటి? డబ్బు నిలవడం కోసం ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే చూసేయండి.
లక్ష్మీ ఇంట్లోకి రాకపోయినా, నివాసంలో డబ్బు నిలవకపోయినా.. టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ థెరపిస్ట్ ప్రకారం ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలను సాధించవచ్చని తెలుస్తోంది. ఈ పరిహారాన్ని పాటించడం వలన ఇంటిలోకి లక్ష్మీ రాక పెరుగుతుందని చెబుతున్నారు. వచ్చే సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు లక్ష్మీ నిలవడం ప్రారంభం అవుతుంది.
ఇందుకోసం ఇంటిలోనే రెమెడీ చేయించుకోవాలని టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ థెరపిస్ట్ ఓ సందర్భంలో తెలిపారని సమాచారం. ఇంటి మెయిన్ డోరుకు రెండు వైపులా పసుపు పొడి చల్లాలని చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఈ పరిహారాన్ని 21 రోజుల పాటు చేయాలి. దీనిల వలన మీ ఇంటికి లక్ష్మీ రావడం తథ్యమని తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇంటిలో ఉండే వారు చేస్తున్న వ్యాపారాలు సైతం పుంజుకుని లాభాల బాటలో నడుస్తాయని చెబుతున్నారు.
అయితే ఈ పరిహారాన్ని చేసే వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలట. పసుపును మెత్తగా పౌడర్ లా చేసుకోవాలని, ఆ పొడిని మాత్రమే చల్లుకోవాలని తెలిపారు. ఇలా చేస్తున్నప్పుడు డబ్బు మన దగ్గరకు వస్తోందని మనసులో అనుకోవాలని సూచించారు. ఈ విధంగా 21 రోజులు క్రమం తప్పకుండా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రెమెడీ తీసుకున్న తరువాత ఈ పసుపును సేకరించి ఏదైనా మొక్కలో ఉంచాలని తెలిపారు.