https://oktelugu.com/

Loan App నిర్వాహకుల టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా?

లోన్ తీసుకునేటప్పుడు ‘యాక్సెస్ ఆల్ ఆప్షన్స్ ’ అనే మెసేజ్ వచ్చి ‘Allow’ అనే ఆప్షన్ ను అడుగుతుంది. దీనిని ఒకే చేయడం ద్వారా మొబైల్ ఉన్న సమాచారం మొత్తం లోన్ యాప్ నిర్వాహకుడి వద్దకు వెళ్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2024 / 03:25 PM IST

    Loan App Tourcher

    Follow us on

    Loan App: ప్రతిరోజూ దినపత్రిలో లోన్ యాప్ వేధింపులతో చనిపోయారనే వార్తలు వింటున్నాం. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకోవద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరు పదే పదే వీటి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. రుణం తీసుకోవడానికి ఇతర మార్గాలు ఎన్నో ఉన్నా.. క్షణాల్లో డబ్బు బ్యాంకులో వేస్తారని అనుకుంటూ వీటిపై మక్కువ చూపుతున్నారు. అయితే లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాక డబ్బులు కట్టకపోతే వారి టార్చర్ ఏ విధంగా ఉంటుందో తెలుసా?

    ‘మొబైల్ ఉంటే చాలు క్షణాల్లో మీ బ్యాంకులో డబ్బు యాడ్ అవుతుంది..’అంటూ వచ్చే ప్రకటనలకు కొందరు మోసపోతున్నారు. అంతేకాకుండా తక్కువ వడ్డీకే రుణం ఇస్తున్నారని నమ్మబలుకుతారు. ప్రతీ లోన్ పై 4 శాతం మాత్రమే వడ్డీ అని చెబుతారు. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్ రాదని అనుకొని పలు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంటారు.కానీ ఇది వార్షిక వడ్డీ కాదని, నెల వడ్డీ అని గుర్తుంచుకోవాలి.

    ఒక వ్యక్తి లోన్ యాప్ తీసుకునే ముందు 4 శాతం వడ్డీ అని చెబుతారు. కానీ అది వార్షిక వడ్డీ రేటు. అంటే నెలకు 4 శాతం చొప్పున 12 నెలలకు మొత్తంగా 48 శాతం వడ్డీని విధిస్తారు. అంటే రూ.4 వడ్డీని విధిస్తారు. ఈ విషయం తరువాత తెలుసుకున్నాక.. అసలు కంటే వడ్డీ ఎక్కువయ్యాక కొందరు రుణం మొత్తాన్ని కట్టడం మానేస్తారు. ఇలా ఇన్ టైంలో కట్టకపోవడందో ఆ చార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయి. వీటిపై కొందరు ఏం కాదులే అన్న విధంగా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ రుణం అందించే కొన్ని యాప్ లు ముందుగానే ఒక పథకాన్ని వేస్తాయి.

    లోన్ తీసుకునేటప్పుడు ‘యాక్సెస్ ఆల్ ఆప్షన్స్ ’ అనే మెసేజ్ వచ్చి ‘Allow’ అనే ఆప్షన్ ను అడుగుతుంది. దీనిని ఒకే చేయడం ద్వారా మొబైల్ ఉన్న సమాచారం మొత్తం లోన్ యాప్ నిర్వాహకుడి వద్దకు వెళ్తుంది. అంటే మొబైల్ లోని కాంటాక్స్, ఫొటోస్, వీడియోలు మొత్తం వారి చేతుల్లోకి వెళుయి. ఇన్ టైంలో లోన్ చెల్లించకపోతే కాంటాక్ట్స్ ను బట్టి ఇతరులకు సదరు వ్యక్తి సమాచారాన్ని చేరవేరుస్తారు. ఆ తరువాత సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తారు. అప్పటికీ రుణ మొత్తాన్ని చెల్లించకపోతే అప్పటికే టేకోవర్ చేసుకున్న ఫొటోస్, వీడియోల ను మార్పింగ్ చేసి వారికి పంపించి బెదిరిస్తారు.

    ఇలా చివరికి కట్టలేని స్థితికి వచ్చిన కొందరు అవమానం తట్టుకోక ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా .. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందువల్ల లోన్ యాప్ ద్వారా రుణం తీసుకోవడం మానేయండి. బంగారం ఉంటే వాటి ద్వారా బ్యాంకులో రుణం తీసుకోండి. లేదా వ్యక్తిగత రుణాలను బ్యాంకు ద్వారా మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి..