Railway Recruitment 2021: దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 4,103 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 11 ట్రేడ్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.
విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే ఏసీ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు 250, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 18, డీజిల్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు 531, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు 92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 71, ఎంఎంటీఎం ఉద్యోగ ఖాళీలు 5, ఎంఎండబ్ల్యూ ఉద్యోగ ఖాళీలు 24, పెయింటర్ ఉద్యోగ ఖాళీలు 80, వెల్డర్ ఉద్యోగ ఖాళీలు 553 ఉన్నాయి.
వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తివివరాలను తెలుసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.