Post Office Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్స్ ను ఎక్కువగా పోస్టల్ శాఖ ద్వారా అమలు చెస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డబ్బును పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్స్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీసులు ఉత్తమమైనవని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. గ్రామ సుమంగళ్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో ఒకటనే సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం ఆరు బీమా ఆప్షన్లు ఉండగా 20 సంవత్సరాల పాటు రోజుకు 95 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 14 లక్షల రూపాయలను పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఈ పథకంలో రెండు ఆప్షన్లు ఉండగా 15 సంవత్సరాల పరిమితితో ఒక ఆప్షన్ 20 సంవత్సరాల పరిమితితో మరో ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. 15 సంవత్సరాల పాటు పాలసీలో మనీ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. పాలసీ తీసుకున్న ఆరు సంవత్సరాల తర్వాత 20 శాతం, 12 సంవత్సరాల తర్వాత 20 శాతం మొత్తాన్ని పొందవచ్చు. మిగిలిన మొత్తం 40 శాతం మెచ్యూరిటీపై బోనస్ గా పొందే ఛాన్స్ ఉంటుంది.
25 సంవత్సరాల వ్యక్తి 7 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కొరకు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2853 రూపాయలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు హామీపూరిత మొత్తం, బోనస్ కింద 13.71 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.