https://oktelugu.com/

Solo Life: సోలో ప్రయాణం సో బెటర్.. కానీ ఇవి లేకపోతే తిప్పలు తప్పవు… అవెంటో తెలుసుకోండి..

సోలో లైఫ్ సో బెటర్ అని కొందరి అభిప్రాయం. తమకు నచ్చిన విధంగా జీవితం ఉండాలని కోరుకునేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఇతర వ్యక్తుల అభిప్రాయాలు, అలవాట్లను ఇష్టపడరు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 28, 2024 / 11:45 AM IST

    Solo Life

    Follow us on

    Solo Life: ప్రపంచం ఎంతో అందమైనది. కానీ ప్రతీ వ్యక్తి ప్రపంచాన్ని చుట్టి రావడం కష్టమే. కానీ సమయం దొరికినప్పుడల్లా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూసేందుకు చాలా మంది ట్రావెల్ చేస్తారు. అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లే ముందు స్నేహితులతోనో లేక తెలిసిన వారితోనో వెళ్తారు. కానీ ఇటీవల చాలా మంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. నిత్యం ఉద్యోగం, వ్యాపారాలతో బిజీగా ఉన్న వారు కొన్ని రోజుల పాటు కొత్త ప్రదేశంలోకి వెళ్లి ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. సమయం, సందర్భం వల్ల ఒక్కోసారి ఇతర వ్యక్తులతో ప్రయాణం చేయడం కుదరదు. దీంతో ఒంటరిగానే జర్నీ మొదలుపెడుతున్నారు. ఇతర వ్యక్తులతో కాకుండా ఒంటరిగా ప్రయాణం చేయడం కూడా ఒక హాబీనే. వీరిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. వివిధ ప్రదేశాలకు వెళ్లిన వీడియోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను ఎంచుకొని నిర్ణీత సమయంలో వాటిని చుట్టేస్తున్నారు. అయితే స్నేహితులతో కాకుండా ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ కొన్ని సమస్యలు లేకపోలేదు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైతే వెళ్తున్నామో.. అక్కడి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవాలి. అలా కాకుండా సోలో ప్రయాణం చేయడం వల్ల చిక్కుల్లో పడుతారు. అయితే ఈ ప్రయాణంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వివరాలు తెలుసుకోవాలని ఉందా?

    సోలో లైఫ్ సో బెటర్ అని కొందరి అభిప్రాయం. తమకు నచ్చిన విధంగా జీవితం ఉండాలని కోరుకునేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఇతర వ్యక్తుల అభిప్రాయాలు, అలవాట్లను ఇష్టపడరు. ఏ పని అయినా ఒంటరిగా చేస్తారు. ఇలాగే ఒంటరిగా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతారు. ట్రావెల్ ట్రిప్ చేసినప్పుడు ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వారు ఈ ఎంజాయ్ మెంట్ ను ఒక్కరే అనుభవిస్తారు. ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అవేంటంటే?

    ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల కొన్ని విషయాలను కొత్త వ్యక్తులతో షేర్ చేసుకోలేము. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటి గురించి తెలుసుకోవాలంటే కొత్త వ్యక్తులను అడగాల్సిందే. ఆ ప్రదేశంలో ఇతర భాషల వాళ్లు ఉంటే అర్థం కాదు. ట్రావెల్ చేసినప్పడు, లేదా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో తమను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

    అయితే ఒంటరిగా ప్రయాణం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైతే వెళ్తున్నామో.. అక్కడి ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ట్రైన్, ఫ్లైట్ కు సంబంధించిన వివరాలు, బస చేసే హోటల్ సౌకర్యవంతంగా ఉందా? లేదా? అనే విషయాలను ముందే గ్రహించాలి. ఈ ప్రయాణంలో మరో వ్యక్తి ఉండరు. అందువల్ల మెడికల్ కిట్ కచ్చితంగా ఉంచుకోవాలి. ఇక లగేజీ ఎక్కువగా కాకుండా అత్యవసరమైనవి మాత్రమే తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ఇతర భాషా ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ తెలుసుకోవాలి. లేదా అక్కడి భాష తెలిసినట్లయితేనే ప్రయాణం చేయడం మంచిది. ఈ మధ్య ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ ఎక్కువగా సాగుతున్నాయి. అయితే పూర్తిగా వాటిని నమ్ముకోకుండా అసవరమైన క్యాష్ చేతిలో ఉంచుకోవాలి. లగేజీలో ముఖ్యంగా టార్చ్, గాడ్జెట్స్, విదేశాలకు వెళ్లే వారైతే పాస్ పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అత్యవసర పరిస్థితల్లో ఉంటే స్థానిక ఎమర్జెన్సీ నెంబర్లు ఏవో ముందుగానే తెలుసుకోవాలి.