https://oktelugu.com/

Tollywood Heroes: మీడియం రేంజ్ హీరోల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి సెట్ అయ్యే హీరోలు ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలు కూడా ప్రస్తుతం సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు...సాయి ధరమ్ తేజ్ ను కనక మనం చూసుకునట్లైతే ఆయన ఒకటి రెండు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించినప్పటికీ అవి ఆయనకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : July 28, 2024 / 11:31 AM IST

    Tollywood Heroes

    Follow us on

    Tollywood Heroes: సినిమా ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి ఎప్పటికీ మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడున్నా స్టార్ హీరోలందరూ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారే కావడం విశేషం… ఇక రీసెంట్ గా ప్రభాస్ కూడా స్పిరిట్ సినిమాలో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరోలు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించి మెప్పించడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల పాత్రలు చేస్తూ స్టార్ హీరోలుగా ఎదిగారు. కాబట్టి వాళ్ళకంటూ ఒక స్ట్రేచర్ అనేది వచ్చింది. ఇక ఇప్పుడు వాళ్లు ఏ క్యారెక్టర్ చేసిన నడుస్తుంది. కానీ మీడియం రేంజ్ హీరోల్లో కొంతమంది మాత్రమే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని సక్సెస్ ఫుల్ గా చేయగలరు. వాళ్లలో ఎవరెవరున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    Also Read: తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్న నాగార్జున

    సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్ ను కనక మనం చూసుకునట్లైతే ఆయన ఒకటి రెండు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించినప్పటికీ అవి ఆయనకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు.కానీ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పడితే మాత్రం ఆ పాత్రలో ఆయన జీవిస్తాడనే చెప్పాలి. ఇక ఆ పాత్ర కి కూడా ఒక సపరేట్ గుర్తింపును తీసుకొచ్చే విధంగా ఆయన నటన ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ జానర్లోనే సాగుతూ వచ్చాయి. కాబట్టి వాటిని ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్లడంలో ఆయన చాలావరకు ప్రయత్నం చేసే సక్సెస్ అయ్యాడు. గత సంవత్సరం వచ్చిన ‘విరూపాక్ష’ సినిమాలో ఒక కొత్త రకం పాత్రను ట్రై చేసి దానికి ప్రాణం పోయడమే కాకుండా సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు…

    సుమంత్

    అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరియర్ మొదట్లో ఒకటి రెండు విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆయనకు సక్సెస్ లు అనేవి చాలా వరకు కరువయ్యాయి. అయినప్పటికీ నటన పరంగా మాత్రం ఆయన ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ప్రస్తుతానికి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటిస్తూనే హీరోగా కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా ‘అహం రీబుట్’ అనే సినిమాలో రేడియో జాకీగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి ఈ సినిమా మొత్తం ఒకే పాత్ర మీద నడిచినప్పటికీ సినిమాలో ఉండే ఎమోషన్ ని ఆయన చాలా బాగా పండించారు. ఇక రెండు గంటల పాటు సాగే ఈ సినిమా ఒక్కరి మీదే అంత సేపు సినిమాని రన్ చేయడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ సుమంత్ ఒక్కడే ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండ అంతసేపు క్యూరియాసిటి తో చూసేలా చేశాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి ఓటీటీ లో ఈ సినిమా మంచి వ్యూహర్షిప్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది…

    ఇక సుమంత్ కూడా కెరియర్ స్టార్టింగ్ లో ఒకటి రెండు పోలీస్ ఆఫీసర్ పాత్రలను చేసినప్పటికీ అవి అంత పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఒక మంచి సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కనక ఆయనకు పడితే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన కటౌట్ చూస్తేనే ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. అలాంటి వ్యక్తిని మనం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కరెక్ట్ గా పోట్రే చేయగలిగితే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రస్తుతం ఆయన ‘సంతోష్ జగర్లపూడి’ డైరెక్షన్ లో ‘మహేంద్ర గిరి వారాహి’ అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ కొడుతున్నాను అని ఆయన చాలా కన్ఫిడెంట్ గా ఉన్నాడు…

     

    Also Read:  పుష్ప 2తో అల్లు అర్జున్ విధ్వసం… మైండ్ బ్లాక్ చేస్తున్న ట్రేడ్ వర్గాల అంచనాలు, ఇండియాలోనే ఎన్ని కోట్లు అంటే?