Children Health: చిన్న పిల్లలు ఏడ్చినా కన్నీరు ఎందుకు రాదో తెలుసా?

చంటి బిడ్డలు పుట్టినప్పుడు కన్నీటి నాళాలు పూర్తిగా ఏర్పడవు. కన్నీళ్ల పరిమాణం వారి కళ్ల నుంచి కారడానికి సరిపోదట. అందుకే వారు ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు. వీరు పుట్టిన రెండు లేదా మూడు నెలల వయసు తర్వాతనే కన్నీళ్లు వస్తాయట.

Written By: Swathi Chilukuri, Updated On : January 30, 2024 2:01 pm
Follow us on

Children Health: ఓ చిన్న నలుసుగా అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ.. తొమ్మిది నెలల తర్వాత బయటకు వస్తుంది. వచ్చిన వెంటనే చంటి బిడ్డ ఏడవాల్సిందే. మొదటి సారి బిడ్డ ఏడిస్తే తల్లి సంతోషిస్తుంది. కానీ అదే బిడ్డ ఏడవకపోతే తల్లి మాత్రమే కాదు డాక్టర్లు కూడా ఆందోళన చెందుతారు. ఎందుకు ఏడ్వడం లేదని రకరకాల టెక్నిక్ లు ఉపయోగిస్తారు. పుట్టిన కాసేపటికి అయినా ఏడ్చేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇక తల్లికి మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది. అయితే పిల్లలు ఏడిస్తే వారికి కన్నీళ్లు రావు. దీనికి కారణం కూడా ఉందండోయ్.. ఎందుకో తెలుసా?

చంటి బిడ్డలు పుట్టినప్పుడు కన్నీటి నాళాలు పూర్తిగా ఏర్పడవు. కన్నీళ్ల పరిమాణం వారి కళ్ల నుంచి కారడానికి సరిపోదట. అందుకే వారు ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు. వీరు పుట్టిన రెండు లేదా మూడు నెలల వయసు తర్వాతనే కన్నీళ్లు వస్తాయట. బిడ్డలు పుట్టినప్పటి నుంచి వారి శరీరం అభివృద్ధి విషయంలో చాలా మార్పులు ఏర్పడుతాయి. ఒక్కో నెల పెరిగే కొద్ది వారి శరీరం ఎన్నో నేర్చుకుంటూ మార్పు చెందుతుంటుంది. ఇక సంవత్సరం వయసు వచ్చేవరకు శరీరం మార్పులు చెందుతూనే ఉంటుంది.

బిడ్డలో వస్తున్న మార్పులు గమనించి మురిసిపోయే తల్లి బిడ్డ ఏడిస్తే మాత్రం తల్లడిల్లిపోతుంటుంది. చిన్నారుల కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క జారినా కూడా తల్లి గుండె విలవిలలాడుతుంది. కానీ ఏడుపు కూడా ఓ వరమే అంటారు. ఏడిస్తే కళ్లల్లో ఉండే కల్మషాలు కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తాయట. అయితే బిడ్డలు పుట్టిన కొన్ని నెలల వరకు కూడా కన్నీళ్లు రాకపోవడానికి కారణం వారి శరీర అభివృద్ధి. ఇది ప్రకృతి సిద్దంగా జరిగే మార్పట.ఎవరైనా ఏడ్చినప్పుడు కన్నీళ్లకు ఒక రకమైన వాహిక కారణంగా ఉంటుంది. ఇది పిల్లలకు పూర్తిగా ఏర్పడదు. వారికి అభివృద్ది చెందడానికి సమయం పడుతుంది. అందుకు పిల్లలు ఎంత ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు.

కంటి ఎగువ కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంథి ఉంటుంది. దీని నుంచే కన్నీళ్లు వస్తాయి. ఈ గ్రంధి కళ్లలో తేమను గ్రహిస్తుంది. దీని వల్ల కళ్ల కదలిక తేలిక అవుతుంది. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగా నాళం గొట్టంలా కూడా వ్యవహరిస్తుంది. దీని ద్వారా కళ్లల్లో నుంచి నీళ్లు వస్తాయంటున్నారు నిపుణులు.