Spirit: స్పిరిట్ సినిమాలో ‘సందీప్ రెడ్డి’ మార్క్ బూతుగా ప్రభాస్ నటిస్తాడా?

చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాలంటే అహర్నిశలు కష్టపడుతూ ఉండాలి. అందులో భాగంగానే తెలుగులో స్టార్ హీరో ప్రభాస్ కూడా సినిమా ఔట్ పుట్ కోసం ఎంతో కష్టపడుతారు.

Written By: Swathi, Updated On : January 30, 2024 1:54 pm
Follow us on

Spirit: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో హీరోయిన్ కు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. కొన్ని సినిమాలకు కొందరు ఈజీగా సూట్ అవుతారని.. వారినే ఎంచుకోవాలని అనుకుంటారు దర్శకనిర్మాతలు. ఉదాహరణకి వెంకటేష్ అంటేనే టక్కును గుర్తుకు వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఎంటర్లైన్. కొందరు మాస్, కొందరు క్లాస్, కొందరు బోల్డ్ ఇలా ఎన్నో విధాలుగా ఆకట్టుకుంటారు. అయితే ప్రభాస్ గురించి చెప్పాలంటే ప్రతి విషయంలో తనదైన ముద్ర వేసుకుంటారు.

అయితే చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాలంటే అహర్నిశలు కష్టపడుతూ ఉండాలి. అందులో భాగంగానే తెలుగులో స్టార్ హీరో ప్రభాస్ కూడా సినిమా ఔట్ పుట్ కోసం ఎంతో కష్టపడుతారు. అందుకే ఈయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా రీసెంట్ గా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రభాస్, ప్రశాంత్ అభిమానులు. అయితే ఈ సినిమా తర్వాత స్పిరిట్ సినిమాతో బిజీ అవనున్నారు రెబల్ స్టార్.

సలార్ లో డిఫరెంట్ రోల్ లో కనిపించిన ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఏ విధంగా కనిపిస్తారనే ఆలోచనలో పడ్డారు ప్రభాస్ అభిమానులు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకు ప్రభాస్ కాంబినేషన్ లో సందీప్ సినిమా తీస్తున్నారంటే మరింత ఎక్కువగా అంచనాలను పెంచుకున్నారు ఇద్దిరి అభిమానులు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సినిమా డైరెక్టర్.

ప్రభాస్ క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సందీప్. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారట. ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా లాగా చాలా బోల్డ్ గా ఉండబోతున్నట్టు టాక్. అంటే ప్రభాస్ బోల్డ్ పాత్రలో నటించబోతున్నారా అంటూ ఆయన అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సీన్లను చూడని ప్రభాస్ అభిమానులు బోల్డ్ పాత్రలో ప్రభాస్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటి వరకు డీసెంట్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ స్టార్ హీరో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బోల్డ్ క్యారెక్టర్ ను ఎంత మేర ఒప్పిస్తారో? దాన్ని ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారో అనేది చూడాల్సిందే.