Maruthi Car : భారత్ లో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి కంపెనీ. ఈ కంపెనీ పెట్రోల్, డీజిల్ వేరియంట్ తో పాట CNG కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుండడంతో మారుతి సైతం ఈ కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ మోడల్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రముఖ ఆటో దిగ్గజం టయోటాతో కలిసి మారుతి సుజుకీ eVX ను ఇప్పటికే పలుసార్లు పరీక్షించింది. 2024 ఏడాది చివరిలో eVX ADAS ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నందున దీనిపై ఫోకస్ పెరిగింది. మరి ఈ కారు వివరాల్లోకి వెళితే..
మారుతి సుజుకి నుంచి రిలీజ్ అయ్యే ADAS నుటయోటాతో కలిసి ఉత్పత్తి చేస్తుంది. ఇది బర్న్ ఎలక్ట్రిక్ YY8 స్కేట్ బోర్డ్ పై ఆధారపడి ఉంటుంది. 45 kWh, 60 kWh అనే డ్యూయెల్ బ్యాటరీలను కలిగి ఉంది. వీటిని ఒక్కసారి రిఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఫ్రంట్, బ్యాక్ ఎల్ ఈడీ లైట్లతో ఆకర్షిస్తుంది. ఇందులో ఓపెన్ గ్రిల్ ఉండి ఎగువ దానిలో ADAS సూట్కోసం రాడార్ మాడ్యుల్ ను అమర్చనున్నారు. ADAS లో వచ్చిన మొదటి కారు ఇదే అనుకోవచ్చని అంటున్నారు.
eVX ADAS మోడల్ లో సాధారణ ఐసి ఇంజిన్ ను అమర్చారు. ఇందులో టెయిల్ లైట్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. షార్క్ ఫిన్ యాంటెన్నా, సూక్ష్మవెనుక స్పాయిల్, నాన్ ఫ్లాషీ బంపర్ ను కలిగి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మూడు బాక్స్ డిజైన్ తో సాహ ఎథోస్ ను కలిగి ఉంది. వీల్స్ ఏరోలాగా ఫ్యాన్సీగా లేకపోయినా కారు వెనకాల ఉన్న కెమెరా, డోర్ హ్యాండిల్ ప్రొడక్షన్ స్పెక్ ఆకర్షిస్తుంది. మారుతి నుంచి రిలీజ్ అయ్యే గ్రాండ్ విటారా eVX కంటే ముందే ADAS మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.