Mahashivaratri: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటనే సంగతి తెలిసిందే. పరమశివునికి శివరాత్రి ఎంతో ఇష్టమైన పండుగ కాగా రేపు శివరాత్రి అనే విషయం తెలిసిందే. శివరాత్రి పండుగ రోజున జాగరణ, ఉపవాసం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన చేయడం శ్రేయస్కరమని చెప్పవచ్చు.
ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం చేయలేని వాళ్లు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించడం ద్వారా శుభఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శివరాత్రి రోజున భక్తితో శివుడిపై చెంబుడు నీళ్లు పోసినా శుభ ఫలితాలు కలుగుతాయి. మాఘ బహుళ చతుర్దశి రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. పురాణాల ప్రకారం శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేస్తే ఎంతో మంచిది.
శివ అంటే మంగళం, ఆనందం, శుభం, శ్రేయం, కైవల్యం అనే అర్థాలు వస్తాయి. శివరాత్రి రోజున శివలింగానికి ఎవరైతే అభిషేకం చేసి పూజ చేస్తారో వాళ్లకు పాపాలు తొలగిపోవడంతో పాటు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. క్షీర సాగర మథనంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రాగా శివుడు ఆ విషాన్ని గరళం నందు నిలిపి లోకాన్ని కాపాడటంతో ఆరోజునే శివరాత్రి పండుగను జరుపుకుంటాము.
శివరాత్రి రోజున శివుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శివుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించి పూజలు చేయడం ద్వారా మరింత మంచి ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.