Bheemla Nayak 4th Day Collections Report : కరోనా కల్లోలం తర్వాత థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న వేళ విడుదలైన చిత్రం ‘భీమ్లానాయక్’. ఏపీలో ఆంక్షల మధ్య, తెలంగాణలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

విడుదలైనప్పటి నుంచి మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే శుక్రవారంతోపాటు శని, ఆదివారాలు వీకెండ్ కలిసి రావడంతో భీమ్లానాయక్ మూవీకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక భీమ్లానాయక్ ఊపు సోమవారం కూడా కొనసాగింది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మరీ హిట్ టాక్ వచ్చిన భీమ్లానాయక్ ను చూశారు.
పవన్ కళ్యాణ్ పర్ ఫామెన్స్, రానా ఎమోషన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ మాటలు సూపర్బ్ అంటున్నారు. ఇక తమన్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం అదుర్స్ అంటున్నారు.
ఇలా అన్నీ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.37.15 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు శనివారం రూ.23 కోట్లు (సుమారు)గా సాధించినట్టు సమాచారు. ఇక మూడో రోజు ఉదయం 18 కోట్లు సాధించినట్టు తెలిసింది. సోమవారం వరకూ 150 కోట్లు దాటడం ఖాయం అని తేలింది. వారం రోజుల్లో 500 కోట్లు దాటిపోవడం ఖాయమని అంటున్నారు.
ఇక ఇండియాలోనే 150 కోట్లు అంటే ఇక అమెరికా, ఓవర్సీస్ కలెక్షన్లు చూస్తే 500 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

[…] Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. “హాయిగా నవ్వండి… ఇది ఫ్రీ థెరపీ’ అంటూ రకుల్‌ప్రేత్ సింగ్ పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో పాటు తన ఫొటోని కూడా పోస్ట్ చేయడం ఆకట్టుకుంది. […]
[…] Pawan Kalyan Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడో రోజు కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు. […]